ఏపీలో పింఛన్ల ఏరివేత.. 1.60 లక్షల పింఛన్లపై వేటు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల ఏరివేత రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలో పింఛన్ల వెరిఫికేషన్ చేపట్టింది. మొత్తం 8 లక్షల 18 లక్షల పింఛన్లను వెరిఫికేషన్ చేయనున్నారు. దివ్యాంగుల పింఛన్ తో పాటు వివిధ కేటగిరిల్లో పింఛన్ తీసుకుంటున్న వారి వివరాలను పరిశీలిస్తున్నారు అధికారులు. బోగస్ పింఛన్ల ఏరివేత ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో బోగస్ పింఛన్లు ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో ఈ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. నకలీ సర్టిఫికెట్లతో పింఛన్ తీసుకున్న వారిని గుర్తించి వాటిని తొలగిస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులు, మెడికల్ టీమ్, ఒక డిజిటల్ అసిస్టెంట్ సహాయంతో పింఛన్లు తనిఖీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ మూడు నెలల పాటు చేపట్టనున్నారు. నకిలి సర్టిఫికెట్ ఇచ్చి పింఛన్ తీసుకుంటున్న వారికి నోటీసులు ఇచ్చి ఆ తర్వాత పింఛన్ తొలగించాలని నిర్ణయించారు.
1.60 లక్షల పింఛన్లపై వేటు:
రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాజిక పింఛన్లు పెంచిన సంగతి తెలిసిందే.. అయితే గత వైసీపీ ప్రభుత్వం అనర్హులకు పింఛన్లు అందజేసిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. అందుకే అనర్హులను గుర్తించి వారి పింఛన్లు తొలగించే ప్రక్రియను ప్రస్తత కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా గత ఆరు నెలల్లో 1.60 లక్షల పింఛన్లు తొలగించినట్లు ‘న్యూస్ మినిట్’ అనే వెబ్ సైట్ ఒక కథనాన్ని ప్రచురించింది.
ఇక పింఛన్ల విషయానికి వస్తే.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాజిక పింఛన్లు భారీగా పెంచింది. గత వైసీపీ ప్రభుత్వం దివ్యాంగులకు రూ.3 ఇచ్చేది.. ఆ పింఛన్లను కూటమి ప్రభుత్వం రూ.6 వేలకు పెంచింది. అంతేకాదు అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు ఇస్తోంది.. అయితే నకిలీ సర్టిఫికెట్లతో పింఛన్లు పొందతుండటం వల్ల ప్రభుత్వానికి నష్టం వస్తోంది. అందుకే అనర్హులను గుర్తించేందుకు సర్వే చేపట్టారు.
ఈ సర్వేలో భాగంగా 1.60 లక్షల పింఛన్లపై వేటు పడినట్లు ‘లిబిటెక్ ఇండియా’ అనే సంస్థ గణంకాల ఆధారంగా తెలిసింది. ఆ సంస్థ దేశంలో ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును అధ్యయనం చేస్తుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో 2024 జూన్ నెలలో 65.5 లక్షల పింఛన్ల అందించగా.. డిసెంబర్ నెలలో ఆ సంఖ్య 63,92,702కు తగ్గింది. కేవలం ఆరు నెలల్లోనే 1.60 లక్షల పింఛన్లు తొలగించారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ సర్టిఫికెట్లతో చాలా మంది పింఛన్లు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. దివ్యాంగుల్లో వైకల్య శాతం తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కుగా ఎంటర్ చేసుకున్నారని, అలా ఎంటర్ చేసుకుని పింఛన్ పొందుతున్నారని ఇటీవల నిర్వహించిన సర్వేలో తెలిసింది. అందులో భాగంగా డిసెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేశారు. ఈ సర్వేలో 10,958 మందిని పరిశీలిస్తే 5 శాతం మంది అనర్హులు ఉన్నట్లు సర్వేలో తేలింది.
అంతేకాదు రాష్ట్రంలో దాదాపు 3.2 లక్షల మంది అర్హత లేని వారు పింఛన్ పొందుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. అనర్హులు తీసుకుంటున్న పెన్షన్ వల్ల ప్రభుత్వంపై నెలకు రూ.120 కోట్లు భారం పడుతుందని వారు తెలిపారు. ఆ భారాన్ని తగ్గించుకునేందుకు నకిలీ పెన్షన్ దారులను తొలగిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. మరీ సర్వే పూర్తయ్యే వరకు ఎంత మందిని తొలగిస్తారో చూడాలి..