NTPC Recruitment 2025 నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) లిమిటెడ్ ఫిక్స్డ్ టెర్మ్ ప్రాతిపదికన సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగంలో ఎంపికైన వారికి నెలకు రూ.1,00,000 జీతం ఇస్తారు. బీఈ లేదా బీటెక్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు : మొత్తం పోస్టులు 08
NTPC Recruitment 2025 : NTPC సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్కూట్మెంట్ ద్వారా మొత్తం 08 పోస్టులను భర్తీ చేయనున్నారు.
NTPC Recruitment 2025
వయోపరిమితి :
NTPC Recruitment 2025 దరఖాస్తు చేసే అభ్యర్థుల గరిష్ట వయస్సు 38 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ, ఎన్సీఎల్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
అర్హతలు మరియు అనుభవం :
NTPC Recruitment 2025 : NTPC సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు గుర్తింపు పొందిన యూనివర్సీటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ డిగ్రీ ఉండాలి. పీజీడీఎం లేదా ఎంబీఏ చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు సంబంధిత విభాగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. అభ్యర్థులు విద్యుత్ రంగంలో నియంత్రణ ఫ్రేమ్ వర్క్ పై కూడా అవగాహన కలిగి ఉండాలి.
AP TMC Recruitment 2025 | AP TMC నోటిఫికేషన్ విడుదల
LIC Recruitment 2025 | LIC కెరీర్ ఏజెంట్ జాబ్స్ | డిగ్రీ చదివిన వారికి అవకాశం
జీతం మరియు పదవీ కాలం :
NTPC Recruitment 2025 సీనియర్ ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగాలకు ఎంపికైైన వారికి నెలకు రూ.1,00,000 జీతం చెల్లిస్తారు. అయితే ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత 3 సంవత్సరాలకు మీ అపాయింట్మెంట్ ముగుస్తుంది. ఆ తర్వాత ఎంప్లాయి ప్రదర్శన బట్టి మరో 2 సంవత్సరాలు పొడిగించవచ్చు.
అప్లికేషన్ ఫీజు :
NTPC Recruitment 2025 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అప్లయ్ చేసే జనరల్ కేటగిరి అభ్యర్థులు రూ.300 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీబీ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళలకు ఫీజు లేదు. ఫీజు ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ రెండు పద్ధతుల్లో చెల్లించే అవకాశం ఉంది.
ముఖ్యమైన తేదీలు :
NTPC Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తులు 21 జనవరి 2025న ప్రారంభమయ్యాయి. 04 ఫిబ్రవరి 2025 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
Notification : CLICK HERE
Apply online : CLICK HERE
Kumarswamy
8919356764
dandavenakumaraswamy@gmail.com