NTPC Recruitment 2025 | కరెంట్ ఆఫీసుల్లో ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ ఉద్యోగాలు | ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్ | 3 రోజులే గడువు

NTPC Recruitment 2025 నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 475 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేేయనున్నారు. సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు గేట్ స్కోర్ ఆధారంగా ఎంపికలు చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ చదివి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

NTPC Engineering Executive Trainees Recruitment 2025

పోస్టుల వివరాలు :

NTPC Engineering Executive Trainees పోస్టులు మొత్తం 475 ఉన్నాయి. వీటిలో

పోస్టుల కేేటాయింపులు :

-ఎలక్ట్రికల్ – 135

-మెకానికల్ – 180

-ఎలక్ట్రానిక్స్ & ఇన్ స్ట్రుమెంటేషన్ – 85

-సివిల్ – 50

-మైనింగ్ – 25

అర్హతలు:

NTPC Engineering Executive Trainees ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అదేవిధంగా గేట్ 2024 స్కోర్ కలిగిన అభ్యర్థులు ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ANGRAU Recruitment 2025 | అగ్రికల్చర్ యూనివర్సిటీలో జాబ్స్

వయస్సు:

NTPC Engineering Executive Trainees ఉద్యోగాలకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోగలరు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం :

NTPC Engineering Executive Trainees ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం గేట్ 2024 స్కోర్ ఆధారంగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరచిన వారికి ఉద్యోగం ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు :

NTPC Engineering Executive Trainees పోస్టులకు అప్లయ్ చేసుకునే అభ్యర్థులు రూ.300 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు ఉండదు.

జీతం :

NTPC Engineering Executive Trainees ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ లో రూ.40,000 జీతం ఇస్తారు. ట్రైనింగ్ అయిపోయాక జాబ్ లో జాయిన్ అయిన తర్వాత నెలకు రూ.90,000 జీతం చెల్లిస్తారు. అన్ని రకాల అలవెన్సులు ఉంటాయి.

దరఖాస్తు విధానం :

NTPC Engineering Executive Trainees ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 13వ తేదీ లోపు దరఖాస్తు చేయవలెను. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి దరఖాస్తు చేయని అభ్యర్థులు ఎవరైన ఉంటే త్వరగా అప్లయ్ చేయగలరు. అధికారిక వెబ్ సైట్ లో Adct no 19/2023 పై క్లిక్ చేసి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 13 – 02 – 2025

Notification : CLICK HERE

Apply Online : CLICK HERE

2 thoughts on “NTPC Recruitment 2025 | కరెంట్ ఆఫీసుల్లో ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ ఉద్యోగాలు | ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్ | 3 రోజులే గడువు”

Leave a Comment