UPSC CAPF AC Recruitment 2025 | సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జాబ్స్  నోటిఫికేషన్ 

UPSC CAPF AC Recruitment 2025 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో ఉద్యోగం చేయాలనుకుంటున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(CAPF)లో 357 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు మార్చి 5వ తేదీ నుంచి మార్చి 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హలు.  అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు. 

UPSC CAPF AC Recruitment 2025

పోస్టుల వివరాలు : 

Central Armed Police Forces లో అసిస్టెంగ్ కమాండెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 357 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

మొత్తం పోస్టుల సంఖ్య : 357

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF)24 పోస్టులు
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF)204 పోస్టులు
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)92 పోస్టులు
ఇంటో-టిబెటన్ బోర్డర్ పోలీస్(ITBP)04 పోస్టులు
సశాస్త్ర సీమ బల్(SSB) 33 పోస్టులుు

అర్హతలు : 

UPSC CAPF AC Recruitment 2025 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయస్సు : 

UPSC CAPF AC Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆగస్టు 1, 2025 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు : 

UPSC CAPF AC Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు రూ.200/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు ఉండదు. అప్లికేషన్ ఫీజును ఆన్ లైన్ పద్ధతిలో చెల్లించాలి. 

ఎంపిక ప్రక్రియ: 

UPSC CAPF AC Recruitment 2025 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కింద దశల్లో ఎంపిక ప్రక్రియ అనేది జరుగుతుంది. 

  • రాత పరీక్ష
  • ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్
  • శారీరక సామర్థ్య పరీక్ష
  • వైద్య ప్రమాణాల పరీక్ష
  • ఇంటర్వ్యూ

జీతం : 

UPSC CAPF AC Recruitment 2025 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ సమయంలో స్టార్టింగ్ జీతం రూ.56,100/- ఉంటుంది. తర్వాత ర్యాంకులను బట్టి రూ.2,25,000/- వరకు పెరిగే అవకాశం ఉంది. 

దరఖాస్తు విధానం : 

UPSC CAPF AC Recruitment 2025 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • UPSC అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
  • upsconline.nic.in లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయాలి.
  • అక్కడ లాగిన్ అయ్యి దరఖాస్తును సబ్మిట్ చేయాలి. 
  • అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి. 
  • రూ.200 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 
  • అప్లికేషన్ ని సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

UPSC CAPF AC Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు మార్చి 5వ తేదీ నుంచి మార్చి 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ05 – 03 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ25 – 03 – 2025
సవరణ తేదీమార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు
పరీక్ష తేేదీ03 ఆగస్టు 2025

Notification : CLICK HERE

Apply Online : CLICK HERE

Leave a Comment