NTPC NGEL Recruitment 2025 | గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ లో ఇంజనీర్ పోస్టులు

NTPC NGEL Recruitment 2025 : NTPC అనుబంధ సంస్థ అయిన గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (NGEL) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వివిధ విభాగాల్లో ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 182 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఏప్రిల్ 11వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు. 

NTPC NGEL Recruitment 2025 

పోస్టుల వివరాలు : 

NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ నుంచి వివిధ విభాగాల్లో ఇంజనీర్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 182 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను కింద చూడొచ్చు.

పోస్టు పేరుఖాళీలు
ఇంజనీర్ (సివిల్)40
ఇంజనీర్(ఎలక్ట్రికల్)80
ఇంజనీర్(మెకానికల్)15
ఎగ్జిక్యూటివ(ఫైనాన్స్)26
ఎగ్జిక్యూటివ్(హ్యూమన్ రీసోర్స్)07
ఇంజనీర్ (ఐటీ)04
ఇంజనీర్ (కాంట్రాక్ట్ అండ్ మెటీరియల్)10

NTPC NGEL Recruitment 2025 Education Qualification : 

NTPC GEL ఇంజనీర్ పోస్టులకు సంబంధిత విభాగాల్లో BE / B.Tech ఉత్తీర్ణులై ఉండాలి. ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) పోస్టులకు CA / CMA, ఎగ్జిక్యూటివ్(హ్యూమన్ రీసోర్స్) పోస్టులకు HR లేదా సంబంధిత రంగంలో పీజీ / డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత రంగాల్లో అనుభవం కూడా ఉండాలి. 

NTPC NGEL Recruitment 2025 Age Limit : 

NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. 

NTPC NGEL Recruitment 2025 Application Fee : 

NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ లో పోస్టులకు అప్లయ్ చేసుకునే UR / EWS / OBC అభ్యర్థులు రూ.500/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు ఉండదు. 

NTPC NGEL Recruitment 2025 Selection Process : 

NTPC గ్రీన్ ఎనర్జీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష క్వాలిఫై అయిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. రాత పరీక్ష, అనుభవం, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

NTPC NGEL Recruitment 2025 Salary Details : 

NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ లో పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి రూ.11,00,000/- లక్షల ప్యాకేజీతో జీతం ఇస్తారు. 

How to Apply NTPC NGEL Recruitment 2025: 

NTPC GEL పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 11వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. 

NTPC NGEL Recruitment 2025 Important dates: 

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం11 – 04 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ01 – 05 – 2025
NotificationCLICK HERE
Official WebsiteCLICK HERE

Leave a Comment