AP Health Department Outsourcing Jobs 2025 ఏపీ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డపార్ట్మెంట్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 31 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
AP Health Department Outsourcing Jobs 2025
పోస్టుల వివరాలు:
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆరోగ్య సంస్థలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 31 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీలు |
బయో మెడికల్ ఇంజనీర్(కాంట్రాక్ట్) | 01 |
ఆడియో మెట్రిక్ టెక్నీషియన్(కాంట్రాక్ట్) | 05 |
రేడియో గ్రాఫర్ (కాంట్రాక్ట్) | 03 |
ల్యాబ్ టెక్నీషియన్ (కాంట్రాక్ట్) | 01 |
థియేటర్ అసిస్టెంట్ (అవుట్ సోర్సింగ్) | 04 |
ఆఫీస్ సబార్డినేట్ (అవుట్ సోర్సింగ్) | 01 |
జనరల్ డ్యూటీ అటెండెంట్ (అవుట్ సోర్సింగ్) | 11 |
ప్లంబర్ (అవుట్ సోర్సింగ్) | 02 |
పోస్ట్ మార్టం అసిస్టెంట్ (అవుట్ సోర్సింగ్) | 03 |
అర్హతలు:
AP Health Department Outsourcing Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
- బయో మెడికల్ ఇంజనీర్ : BE / B.Tech / ME / M.Tech (బయో మెడికల్ ఇంజనీరింగ్)
- ఆడియో మెట్రిక్ టెక్నీషియన్ : ఆడియాలజీలో డిగ్రీ లేదా డిప్లొమా
- రేడియోగ్రాఫర్ : CRA / DRGA / DMIT సర్టిఫికెట్, APPMB రిజిస్ట్రేషన్
- ల్యాబ్ టెక్నీషియన్ : DMLT / BSc(MLT), APPMB రిజిస్ట్రేషన్
- థియేటర్ అసిస్టెంట్ : 10వ తరగతి మరియు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్
- ఆఫీస్ సబార్డినేట్ : 10వ తరగతి
- జనరల్ డ్యూటీ అటెండెంట్ : 10వ తరగతి
- ప్లంబర్: 10వ తరగతి మరియు ఐటిఐ
- పోస్ట్ మార్టం అసిస్టెంట్ : 10వ తరగతి
వయస్సు:
AP Health Department Outsourcing Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచ 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
AP Health Department Outsourcing Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ.500/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఫీజు లేదు. అప్లికేషన్ ఫీజును ఆఫ్ లైన్ విధానంలో చెల్లించాలి. డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, వెస్ట్ గోదావరి పేరుపై డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి.
ఎంపిక ప్రక్రియ :
AP Health Department Outsourcing Jobs 2025 పోస్టులకు విద్యార్హతలు, అనుభవం, సర్వీస్ వెయిటేజీ ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు వెయిటేజీ నిర్ణయించారు.
- విద్యార్హతల్లో వచ్చిన మార్కులు – 75 మార్కులు
- అర్హత సాధించిన తర్వాత పూర్తయిన సంవత్సరాలకు – 10 మార్కులు
- అనుభవం – 15 మార్కులు
జీతం :
AP Health Department Outsourcing Jobs 2025 ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టును బట్టి జీతం ఉంటుంది.
కాంట్రాక్ట్ పోస్టులు:
- బయో మెడికల్ ఇంజనీర్ – రూ.54,060/-
- ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ – రూ.32,670/-
- రేడియోగ్రాఫర్ – రూ.35,670/-
- ల్యాబ్ టెక్నీషియన్ – రూ.32,670
అవుట్ సోర్సింగ్ పోస్టులు :
థియేటర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ప్లంబర్, పోస్ట్ మార్టం అసిస్టెంట్ పోస్టులకు రూ.15,000/- జీతం ఇస్తారు.
దరఖాస్తు విధానం:
AP Health Department Outsourcing Jobs 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో వివరాలను నింపి, అవసరమైన డాక్యుమెంట్లు జత చేయాలి. జనరల్ అభ్యర్థులు రూ.500/- డిమాండ్ డ్రాఫ్ట్ జత చేయాలి. అప్లికేషన్ ని ఏప్రిల్ 19వ తేదీ లోపు ఏలూరులోని DCHS కార్యాలయంలో సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేేదీ | 09 – 04 – 2025 |
దరఖాస్తులకు చివరి తేదీ | 19 – 04 – 2025 |
Notification | CLICK HERE |
Official Website | CLICK HERE |