IAF Agniveer Musician Recruitment 2025 | ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మ్యూజిషియన్ జాబ్స్ నోటిఫికేషన్

IAF Agniveer Musician Recruitment 2025 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ లో మ్యూజిషియన్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేేయడం జరగింది. దరఖాస్తు ప్రారంభ ప్రక్రియ ఏప్రిల్ 21వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు మే 11వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి అనే విషయాన్ని నోటిఫికేషన్ లో ప్రస్తావించలేేదు. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. 

IAF Agniveer Musician Recruitment 2025  

పోస్టుల వివరాలు: 

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ లో మ్యూజిషియన్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం పోస్టుల ఖాళీల వివరాలను నోటిఫికేషన్ లో ప్రస్తావించలేదు. 

అర్హతలు : 

IAF Agniveer Musician Recruitment 2025 అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మరియు మంచి సంగీత సామర్థ్యం కలిగి ఉండాలి. అభ్యర్థులు సంగీతంలో డిప్లొమా లేదా సంగీత కార్యక్రమాల నుంచి సర్టిఫికెట్లు లేదా అవార్డులు తీసుకున్న సంగీత అనుభవ ప్రమాణాలను కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 

IAF Agniveer Musician Recruitment 2025  అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అభ్యర్థులు జనవరి 2, 2005 మరియు జూలై 2, 2008 మధ్య జన్మించి ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: 

IAF Agniveer Musician Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అన్ని కేటగిరీల అభ్యర్థులు రూ.100/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

ఎంపిక ప్రక్రియ: 

IAF Agniveer Musician Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను కింది దశల్లో ఎంపిక చేస్తారు. 

  • సంగీత వాయిద్య వాయించే పరీక్ష
  • రాత పరీక్ష
  • అనుకూలత పరీక్ష-I
  • శారీరక ధ్రుడత్వ పరీక్ష
  • అనుకూలత పరీక్ష -II
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • వైద్య పరీక్ష

శారీరక అర్హత ప్రమాణాలు : 

IAF Agniveer Musician Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే పురుష మరియు మహిళా అభ్యర్థులకు కింది శారీరక అర్హత ప్రమాణాలు ఉండాలి. 

పురుష అభ్యర్థులకు : 

  • ఎత్తు: 162 సెం.మీ.
  • ఛాతీ : 77 – 82 సెం.మీ
  • బరువు : ఎత్తును బట్టి 
  • రన్నింగ్ : 7 నమిసాల్లో 1.6 కి.మీ.
  • 01 నిమిషంలో 10 పుష్ అప్స్
  • 01 నిమిషంలో 10 సిట్ అప్స్
  • 01 నిమిషంలో 20 స్క్వాట్స్

మహిళా అభ్యర్థులకు:

  • ఎత్తు : 152 సెం.మీ.
  • బరువు : ఎత్తును బట్టి
  • రన్నింగ్ : 8 నిమిషాల్లో 1.6 కి.మీ.
  • 01 నిమిషంలో 10 సిట్ అప్స్
  • 01 నిమిషంలో 16 స్క్వాట్స్

జీతం : 

IAF Agniveer Musician Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అగ్నవీర్ నిబంధనల ప్రకారం జీతం ఇస్తారు. వీరి జీతంలో 30 శాతం సేవా నిధికి వెళ్తుంది. 4 సంవత్సరాల తర్వాత ఒకేసారి రూ.10 లక్షలు ఇస్తారు. రూ.48 లక్షల జీవిత బీమా కవర్ ఉంటుంది. 

  • 1వ సంవత్సరం : నెలకు రూ.30,000/-
  • 2వ సంవత్సరం : నెలకు రూ.33,000/-
  • 3వ సంవత్సరం : నెలకు రూ.36,500/-
  • 4వ సంవత్సరం : నెలకు రూ.40,000/-

దరఖాస్తు విధానం : 

IAF Agniveer Musician Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 21వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ముఖ్యమైన తేదీలు : 

దరఖాస్తులు ప్రారంభ తేేదీ21 – 04 – 2025
దరఖాస్తులకు చివరి తేదీ11 – 05 – 2025
ర్యాలీ తేేదీ10 – 06 – 2025 నుంచి 18 – 06 – 2025
NotificationCLICK HERE
Official WebsiteCLICK HERE

Leave a Comment