AP SSC Results 2025 : ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఇంటర్మీడియట్ ఫలతాలు విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే పదో తరగతి ఫలితాలు విడుదలవుతాయి. ప్రస్తుతం పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ జరుగుతోంది. అధికారులు పదో తరగతి మార్కుల కంప్యూటరీకరణ పనిలో ఉన్నారు.
ఏపీలో పదో తరగతి పరీక్షలు మార్చి 17వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు ప్రశాతంగా జరిగాయి. విద్యార్థులు ప్రస్తుతం AP SSC Results 2025 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఈ ప్రక్రియ ఏప్రిల్ 15వ తేదీ వరకు జరుగుతుంది. ఆ తర్వాత మార్కుల క్రమబద్దీకరణ, కంప్యూటకరీకరణ ఉంటుంది.
ఈక్రమంలో కీలక అప్ డేట్ వచ్చింది. AP SSC Results 2025 విడుుదల తేదీ ఖరారు అయ్యింది. ఏప్రిల్ 22వ తేదీన పదో తరగతి ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే ఇది అంచనా మాత్రమే. ఈ తేదీలో మార్పు కూడా జరగవచ్చు.
How to Check AP SSC Results 2025 :
ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలను రెండు పద్ధతుల్లో తెలుసుకోవచ్చు. ఏపీ అధికారిక వెబ్ సైట్ మరియు వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
AP SSC Results 2025 check with Website:
- ముందుగా అధికారిక వెబ్ సైట్ https://www.bse.ap.gov.in/ లోకి వెళ్లాలి.
- AP SSC Results 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
- అక్కడ విద్యార్థి యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- అంతే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
- ఫలితాలను పీడీఎఫ్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
AP SSC Results 2025 Check with Whatsapp :
- మన మిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ను సేవ్ చేసుకుని, వాట్సాప్ లో ‘HI’ అని మెసేజ్ చేయాలి.
- ఆ తర్వాత ‘సర్వీస్ ఎంచుకోండి’ లో ‘విద్యా సేవలు’ ఎంచుకోవాలి.
- Download AP SSC Results 2025 పై క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి.
- ఫలితాలు మీ వాట్సాప్ లో ప్రత్యక్షమవుతాయి.
- ఫలితాలను పీడీఎఫ్ రూపంలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.