NSD Recruitment 2025 | 12th అర్హతతో క్లర్క్ జాాబ్స్

NSD Recruitment 2025 నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టర్, అసిస్టెంట్ లైట్ అండ్ సౌండ్ టెక్నీషియన్, అసిస్టెంట్ వాడ్రోప్ సూపర్ వైజర్, లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 11 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి దేశపౌరులందరూ అప్లయ్ చేసుకోవచ్చు. 

NSD Recruitment 2025

పోస్టుల వివరాలు: 

ఢిల్లీలోని బహవల్ పూర్ హౌస్ లో ఉన్న నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం పోస్టులు 11 ఉన్నాయి. 

పోస్టు పేరుఖాళీల సంఖ్య
అకౌంట్స్ ఆఫీసర్ (డిప్యుటేషన్)1
అసిస్టెంట్ రిజిస్ట్రార్ (డిప్యుటేషన్)2
అసిస్టెంట్ లైట్ అండ్ సౌండ్ టెక్నీషియన్1
అసిస్టెంట్ వార్డ్ రోబ్ సూపర్ వైజర్1
లోయర్ డివిజన్ క్లర్క్ 6

అర్హతలు: 

NSD Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి అర్హతలు ఉంటాయి. కొన్ని పోస్టులకు అనుభవం కూడా అవసరం ఉంటుంది. 

పోస్టు పేరు అర్హతలు
అకౌంట్స్ ఆఫీసర్బి.కామ్ (అడ్వాన్స్ అకౌంటెన్సీ ఆడిటింగ్) మరియు 5 సంవత్సరాల అడ్మినిస్ట్రేటివ్ లేదా సూపర్ వైజరీ అనుభవం ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్ నాలెడ్జ్ ఉండాలి. 
అసిస్టెంట్ రిజిస్ట్రార్ఏదైనా డిగ్రీ మరియు 5 సంవత్సరాల అడ్మినిస్ట్రేటివ్ అనుభవం ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్ నాలెడ్జ్ ఉండాలి.
అసిస్టెంట్ లైట్ అండ్ సౌండ్ టెక్నీషియన్10+2 మరియు ఎలక్ట్రికల్ లేదా సౌండ్ టెక్నాలజీలో డిప్లొమా మరియు 5 సంవత్సరాల లైటింగ్ లేదా సౌండ్ ఆపరేషన్ లో అనుభవం ఉండాలి. 
అసిస్టెంట్ వార్డ్ రోబ్ సూపర్ వైజర్10+2 మరియు కట్టింగ్ లేదా టైలరింగ్ లో డిప్లొమా మరియు 2 సంవత్సరాల థియేటర్ సంస్థలో అనుభవం ఉండాలి.
లోయర్ డివిజన్ క్లర్క్10+2 మరియు ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్ స్పీడ్ ఉండాలి.  

వయస్సు: 

NSD Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి వయోపరిమితి మారుతూ ఉంటుంది. ముఖ్యంగా లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు: 

NSD Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ.500/-, ఓబీసీ అభ్యర్థులు రూ.250/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ మరియు మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

NSD Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి వివిధ దశల్లో ఎంపిక చేస్తారు. 

పోస్టు పేరుఎంపిక విధానం
అకౌంట్స్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ రిజిస్ట్రార్ఇంటర్వ్యూ
అసిస్టెంట్ లైట్ అండ్ సౌండ్ టెక్నీషియన్ మరియు అసిస్టెంట్ వార్డ్ రోడ్ సూపర్ వైజర్రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, కనీస అర్హత మార్కుల ఆధారంగా
లోయర్ డివిజన్ క్లర్క్స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్

జీతం: 

NSD Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టున బట్టి జీతాలు ఇస్తారు. లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగానికి రూ.40,000/- వరకు జీతం ఇస్తారు. 

దరఖాస్తు విధానం: 

NSD Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లయ్ లింక్ కింద ఇవ్వబడింది. అభ్యర్థులు క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. 

  • దరఖాస్తులకు చివరి తేదీ : 28 – 04 – 2025
  • డిప్యుటేషన్ పోస్టులకు : 15 – 05 – 2025
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Leave a Comment