AP DSC Notification 2025 | ఏపీలో ఐదు రోజుల్లో డీఎస్సీ..2,260 కొత్త పోస్టులు

AP DSC Notification 2025 ఆంధ్రప్రదేశ్ లో టీచర్ ఉద్యోగాలకు ప్రీపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ పై మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. మరో 5 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణ వల్ల డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలలో ఆలస్యమైందన్నాారు. ఎస్సీ కమిషన్ రిపోర్టుపై ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మరో రెండు రోజుల్లో ఆర్డినెన్స్ ఇచ్చి తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. 

AP DSC Notification 2025 

కొత్తగా 2,260 పోస్టులు: 

రాష్ట్రంలో కొత్తగా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పోస్టులను కూడా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు. దీంతో 16,347 పోస్టులకు అదనంగా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. అయితే ఈ పోస్టులను మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తో కలిపి విడుదల చేస్తారా లేక విడిగా విడుదల చేస్తారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. రెండు కలిపి నోటిఫికేషన్ వస్తే మెగా డీఎస్సీ ద్వారా 18 వేలకుపైగా పోస్టులు ఉంటాయి. 

గతంలో ప్రకటించిన డీఎస్సీకి సంబంధించి 16,347 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో భాగంగా 1,136 ఎస్జీటీ మరియు 1,124 ఎస్ఏ పోస్టులు ఉన్నాాయి. ఈ మెగా డీఎస్సీ ద్వారానే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.  

ఉమ్మడి జిల్లాల వారీగా కొత్త పోస్టులు:

జిల్లాలుఖాళీలు
అనంతపురంఎస్జీటీ – 101
ఎస్ఏ – 100
చిత్తూరుఎస్జీటీ – 117
ఎస్ఏ – 82
తూర్పు గోదావరిఎస్జీటీ – 127
ఎస్ఏ  – 151
గుంటూరుఎస్జీటీ – 151
ఎస్ఏ – 98
కడపఎస్జీటీ – 57
ఎస్ఏ – 49
క్రిష్ణఎస్జీటీ – 71
ఎస్ఏ – 89
కర్నూలుఎస్జీటీ – 110
ఎస్ఏ – 130
నెల్లూరుఎస్జీటీ – 63
ఎస్ఏ – 44
ప్రకాశంఎస్జీటీ – 74
ఎస్ఏ – 50
శ్రీకాకుళం ఎస్జీటీ – 71
ఎస్ఏ – 109
విశాఖపట్నంఎస్జీటీ – 59
ఎస్ఏ – 52
విజయనగరంఎస్జీటీ – 45
ఎస్ఏ – 66
పశ్చిమ గోదావరిఎస్జీటీ – 90
ఎస్ఏ – 105

గతంలో విడుదల చేసిన పోస్టులు:

మొత్తం పోస్టుల సంఖ్య : 16,347

  • సెకండరీ గ్రేడ్ టీచర్లు – 6,371
  • స్కూల్ అసిస్టెంట్ – 7,725
  • ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు – 1,781
  • పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు – 286
  • ప్రిన్సిపల్ పోస్టులు – 52
  • పీఈటీ టీచర్లు – 132

జిల్లాల వారీగా పోస్టులు:

  • శ్రీకాకుళం – 543
  • విజయనగరం – 583
  • విశాఖపట్నం – 1,134
  • తూర్పు గోదావరి – 1,346
  • పశ్చిమ గోదావరి – 1,067
  • క్రిష్ణ జిల్లా – 1,213
  • గుంటూరు – 1,159
  • ప్రకాశం – 672
  • నెల్లూరు – 673
  • చిత్తూరు – 1,478
  • కడప – 709
  • అనంతపురం – 811
  • కర్నూలు – 2,678

Leave a Comment