NPCC Recruitment 2025 నేషనల్ ప్రాజెక్ట్స్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీకిి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సైట్ ఇంజనీర్(సివిల్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు అభ్యర్థులను ఎటువంటి రాత పరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మే 13 నుంచి మే 15వ తేదీ వరకు వాక్ ఇన్స్ జరుగుతాయి. బీటెక్ లేదా బీఈ పూర్తి చేసిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకాగలరు.
NPCC Recruitment 2025
పోస్టుల వివరాలు:
నేషనల్ ప్రాజెక్ట్స్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి సైట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు.
పోస్టు పేరు | ఖాళీలు |
సైట్ ఇంజనీర్ (సివిల్) | 10 |
అర్హతలు:
NPCC Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో BE / B.Tech ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్లు కూడా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
వయోపరిమితి:
NPCC Recruitment 2025 సైట్ ఇంజనీర్ పోస్టుల కోసం ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు 18 నుంచి 40 సంవత్సరా మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
NPCC Recruitment 2025 సైట్ ఇంజనీర్ పోస్టులకు ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
NPCC Recruitment 2025 పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు జాబ్ ఇస్తారు.
జీతం :
NPCC Recruitment 2025 సైట్ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.33,750/- జీతం ఇస్తారు.
దరఖాస్తు విధానం :
NPCC Recruitment 2025 పోస్టులకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్టుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావాలి. అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ డౌన్ లోడ చేసుకుని, వివరాలను నింపాలి. అప్లికేషన్ తో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక:
NPCC లిమిటెడ్,
సౌత్ ఈస్టర్న్ జోనల్ ఆఫీస్,
ప్లాట్ నెం.HIG/166,
శైలశ్రీ విహార్,
భువనేశ్వర్ – 751021,
ఒడిశా.
ఇంటర్వ్యూ జరిగే తేదీలు:
- వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు : 13, 14 & 15 మే, 2025
- ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5.00 వరకు
- రిజిస్ట్రేషన్ సమయం : ఇంటర్వ్యూ రోజుల్లో మధ్యాహ్నం వరకు
Notification | CLICK HERE |
Official Website | CLICK HERE |