IIT Madras Recruitment 2025 | IIT మద్రాస్ లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

IIT Madras Recruitment 2025 : ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ నుంచి వివిధ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా లైబ్రేరియన్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 19వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. అభ్యర్థులు మే 19వ తేదీ వరకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. 

IIT Madras Recruitment 2025

పోస్టుల వివరాలు : 

IIT మద్రాస్ నుంచి నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • లైబ్రేరియన్ (డిప్యుటేషన్) – 1
  • చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ – 1
  • డిప్యుటీ రిజిస్ట్రార్ – 2
  • టెక్నికల్ ఆఫీసర్ – 1
  • అసిస్టెంట్ రిజిస్ట్రార్ – 2
  • జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ – 1
  • జూనియర్ సూపరింటెండెంట్ – 5
  • జూనియర్ అసిస్టెంట్ – 10

అర్హతలు : 

IIT Madras Recruitment 2025 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు పోస్టును బట్టి అర్హతలు మారుతాయి. అలాగే కొన్ని పోస్టులకు అనుభవం కూడా అవసరం ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు. మిగితా ఉద్యోగాలకు అనుభవం అవసరం ఉంటుంది. 

పోస్టు పేరుఅర్హతలు
లైబ్రేరియన్ (డిప్యుటేషన్)లైబ్రరీ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ మరియు పీహెచ్డీ + 15 సంవత్సరాల అనుభవం
చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్మాస్టర్ మరియు సెక్యురిటీలో 15 సంవత్సరాల అనుభవం
డిప్యూటీ రిజిస్ట్రార్మాస్టర్ డిగ్రీ + 5 సంవత్సరాల అనుభవం
టెక్నికల్ ఆఫీసర్ఫిజియోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ + 5 సంవత్సరాల అనుభవం
అసిస్టెంట్ రిజిస్ట్రార్మాస్టర్ డిగ్రీ + 8 సంవత్సరాల అనుభవం
జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్బయోటెక్నాలజీలో డిగ్రీ + 5 సంవత్సరాల అనుభవం
జూనియర్ సూపరింటెండెంట్ఏదైనా డిగ్రీ + 6 సంవత్సరాల అనుభవం
జూనియర్ అసిస్టెంట్ఏదైనా డిగ్రీ మరియు కంప్యూటర్ స్కిల్స్

వయస్సు: 

IIT Madras Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. మిగితా పోస్టుల వయోపరిమితి వివరాలను పూర్తి నోటిఫికేషన్ లో చూడొచ్చు. 

దరఖాస్తు ఫీజు: 

IIT Madras Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ / ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ అభ్యర్థులు రూ.500/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ / మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. 

కేటగిరీఅప్లికేషన్ ఫీజు
UR / EWS / OBCరూ.500/-
SC / ST / PwBD / Womenఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ: 

IIT Madras Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులను వివిధ దశల్లో ఎంపిక చేస్తారు. ముందుగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూకు పిలుస్తారు. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం: 

IIT Madras Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 19వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. 

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తులు ప్రారంభ తేదీ19 – 04 – 2025
దరఖాస్తులకు చివరి తేదీ19 – 05 – 2025

Leave a Comment