How to apply ‘PAN 2.0’? Full Details In 2025

‘పాన్ 2.0’ అప్లయ్ చేసుకోవడం ఎలా?

కేంద్ర ప్రభుత్వం నుంచి పాన్ కార్డ్ 2.0 రిలీజ్ చేసిన సంగతి అందరికి తెలిసిందే.. పాన్ కార్డ్ 2.0 అనే ఈ కొత్త కార్డును అందరూ తీసుకోవాలా? లేదా  పాత పాన్ కార్డు అనేది సరిపోతుందా?అసలు ఈ కొత్త పాన్ కార్డు అనేది ఏ విధంగా తీసుకోవాలి? తీసుకోవడానిక మనికి ఎలాంటి అర్హతలు ఉండాలి? ఈ కొత్త పాన్ కార్డు అనేది ఏ విధంగా పొందాలి? అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

What is the difference between previous PAN card and 2.0 card?

గత పాన్ కార్డుకు 2.0 కార్డుకు తేడా ఏంటీ?

మనం ఇంతకు ముందు వాడే పాత పాన్ కార్డుకు  2.0 పాన్ కార్డుకు మధ్య తేడా ఏంటంటే.. కొత్త పాన్ కార్డులో కొన్ని కొత్త అప్ డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది. మేజర్ అప్డేట్ ఏంటంటే.. మనం వాడే పాత పాన్ కార్డుకు ఈ పాన్ కార్డుకు ఒక క్యూఆర్ కోడ్ అనేది ఛేంజ్ చేయడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ అనేది.. ఇప్పటి నుంచి ఏ సర్వీసులకు అయినా.. బ్యాంక్ లోన్స్ కి అయినా… ఎక్కడైనా ఈ పాన్ కార్డు వాడాలని అనుకుంటే.. మనం పాన్ కార్డు జిరాక్స్ ఇచ్చే వాళ్లం.. అయితే ఈ క్యూఆర్ కోడ్ రావడం వల్ల డైరెక్ట్ గా మన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని అనుకుంటే పాన్ కార్డులో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మన డీటైల్స్ అనేవి డిజిటల్ గా ట్రాన్ఫర్ కావడం జరుగుతుంది. మనం పాన్ కార్డు యొక్క జిరాక్స్ కాపీ ఇవ్వకుండా ఈ క్యూఆర్ కోడ్ అనేది ఇచ్చేస్తే మన వివరాలు వారికి నేరుగా షేర్ అవుతాయి. 

ఇంక ఏంటంటే.. గత పాన్ కార్డులో సెక్యూరిటీ రిజన్స్ తక్కువగా ఉండేవి.. ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త పాన్ కార్డులో సెక్యూరిటీ రీజన్స్ పెంచడం జరిగింది. అదే విధంగా మనకు ఇంతకు ముందు ఉన్న పాన్ కార్డతో పోల్చుకుంటే ఈ పాన్ కార్డులో అప్డేట్ వర్షన్ కూడా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అంతేకాదు పాత పాన్ కంటే కొత్త పాన్ కార్డు వల్ల మనం ఏమైన లోన్స్ కి పెట్టుకున్నప్పుడు ప్రాసెస్ అనేది వేగంగా జరుగుతుంది. 

కొత్త పాన్ కార్డు పొందాలి అంటే ఏం కావాలి?

ఇక ఈ కొత్త పాన్ కార్డు పొందేందుకు ఏం ఎలిజిబిలిటీస్ కావాలంటే.. మన పాన్ లో ఏదైనా ఒక కరక్షన్ పేరు కాని, డేట్ ఆఫ్ బర్త్ ఛేంజ్ కాని, మెయిల్ ఐడీ అప్ డేట్ కాని, మొబైల్ నెంబర్ అప్ డేట్ కాని, అడ్రస్ అప్ డేట్ కాని ఏదో ఒక కరక్షన్ పెట్టుకున్న తర్వాత మీకు 2.0 పాన్ కార్డు అనేది రావడం జరుగుతుందని అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా పాన్ కార్డు కోసం అప్లయి చేసుకున్న వారికి ఈ లెటెస్ట్ వర్షన్ 2.0 పాన్ కార్డు నేరుగా పొస్టు ద్వారా రావడం జరుగుతుంది. 

పాన్ కార్డులో ఏవైనా కరెక్షన్ కోసం పెట్టుకున్నప్పుడు మనకు కొత్త కార్డు అనేది వస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో కూడా మనకు పాన్ రీప్రింట్ కోసం 50 రూపాయలు చలానా కడితే డైరెక్టుగా రీ ప్రింట్ కొత్త 2.0 వర్షన్ కార్డు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం ఏంటంటే మనం పాన్ కార్డులో ఉచితంగా అడ్రస్ అనేది ఛేంజ్ చేసుకుని విత్ మొబైల్ నెంబర్ అదేవిధంగా మెయిల్ ఐడీ కూడా ఛేంజ్ చేసుకుని కొత్త పాన్ కార్డు అనేది అప్లయ్ చేసుకోవచ్చు. 

కొత్త కార్డుకు అప్లయ్ చేసే విధానం..

ఆన్ లైన్ లో NSDL Pan Address Update  అని కొడితే డైరెక్ట్ వెబ్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ పాన్ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి డేట్ బర్త్ ఎంటర్ చేయాలి. ఈ ప్రాసెస్ కంప్లీట్ కావాలంటే మీ మొబైల్ నెంబర్ అనేది మీ పాన్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డుకు లింక్ అయ్యి ఉండాలి. ఆ తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ అక్కడ చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీరు కొత్త మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ మార్చుకోవాలి అనుకుంటే అక్కడ ఛేంజ్ చేసుకోవచ్చు. తర్వాత వెరిఫై చేసుకొని సబ్మిట్ చేస్తే.. మీ అడ్రస్ డీటైల్స్ వస్తాయి. అక్కడ చెక్ చేసుకొని వెరిఫై అనే ఆప్షన్ పై క్లిక్  చేయాలి. అక్కడ మీకు ఒక అక్ నాలెడ్జ్ మెంట్ స్లిప్ అయితే జనరేట్ అవుతుంది. ఆ రిసిప్ట్ సేవ్ చేసుకొని పెట్టుకొండి. 

ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఒక వారంలో పూర్తి అవుతంది. అదేవిధంగా UTI పాన్ తీసుకొనే వాళ్లకు కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఇందులో కూడా మీ పాన్ లో అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న వారంలో మీ పాన్ లో మీ అడ్రస్ అనేది అప్డేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీ పాన్ రీప్రింట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు రీప్రింట్ కాస్ట్ కూడా 50 రూపాయలు ఉంటుంది. మీరు చలాన కట్టుకున్న తర్వాత మీకు కొత్త 2.0 వర్షన్ పాన్ కార్డు అనేది పోస్టులో మీ ఇంటికి రావడం జరుగుతుంది.

Leave a Comment