How to apply ‘Instant PAN Card’ online?ఆన్ లైన్ లో ‘ఇన్ స్టంట్ పాన్ కార్డు’ ఎలా అప్లయ్ చేసుకోవాలి?

‘ఇన్ స్టంట్ Pan card కొరకు ఆన్ లైన్ లో ఎలా అప్లయి చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాన్ కార్డును ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ వారు జారీ చేస్తారని అందరికీ తెలిసిందే.. కొంత మందికి అత్యవసరంగా పాన్ కార్డు కావాల్సి ఉంటుంది.. అయితే వారు పాన్ కార్డు కోసం అప్లయి చేేసి అది రావడానికి ఎంతో సమయం పడుతుంది. అంత వరకు మీరు వేచి ఉండలేరు. ఎందుకంటే వారికి పాన్ కార్డు ఎమర్జెన్సీ ఉంటుంది. అలాంటి వారు ఈ ఇన్ స్టంట్ పాన్ కార్డును అప్లయి చేసుకోవచ్చు. 

ప్రస్తుతం బ్యాంక్ లావాదేవీలు జరగాలంటే పాన్ కార్డు తప్పనిసరి. ఎక్కువ మొత్తంలో డబ్బులు వేయాలన్నా.. తీయాలన్నా పాన్ కార్డు కావాల్సిందే.. పాన్ కార్డు లేకుండా బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోలేరు. ఇన్ ట్యాక్స్ కట్టాలన్నా పాన్ కార్డు తప్పనిసరి.. పాన్ కార్డు పొందాలంటే కొంత సమయం అయితే పడుతుంది. అయితే ఎమర్జెన్సీగా కార్డు అవసరమైన వారికి ఇది ప్రాబ్లమ్ అవుతుంది. అందుకే ఆదాయపు పన్నుల శాఖ వారు కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చారు. ఇన్ స్టంట్ పాన్ కార్డు విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానం ద్వారా మనం డిజిటల్ విధానంలో పాన్ కార్డును పొంద వచ్చు. నిమిషాల్లోనే పాన్ కార్డు మన చేతికి వచ్చేస్తుంది. మరీ ఈ కార్డులు ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఆన్ లైన్ లో ఎలా అప్లయ్ చేయాలి?

ఈ ఇన్ స్టంట్ పాన్ కార్డు కావాలంటే ఆన్ లైన్ లో అయితే అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకున్న నిమిషాల్లోనే పాన్ నెంబర్ వచ్చేస్తుంది. డిజిటల్ అవసరాల కోసం ఈ పాన్ కార్డును వాడుకోవచ్చు. పీడీఎఫ్ ద్వారా ఈ పాన్ కార్డును పొందచ్చు. దీనికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు. మరీ ఎలా అప్లయ్ చేసుకోవాలో చూద్దామా.. 

ముందుగా e-Filing వెబ్ సైట్ లో ఎంటర్ అవ్వాలి. అక్కడ మనకు Instant ePancard అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయాలి. తర్వాత ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మనకు ఒక వార్నింగ్ కూడా ఉంది. ఇన్ కమ్ ట్యాక్స్ 1961 సెక్షన్ 139ఎ ప్రకారం, 272బి ప్రకారం ఎక్కువ పాసెస్ ఉండకూడా. అలా ఉంటే 10 వేల రూపాయల వరకు జరిమాన విధిస్తారని వార్నింగ్ ఉంటుంది.

అక్కడ రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి. గెట్ ఈ పాన్, డౌన్ లోడ్ పాన్ అనే ఆప్షన్లు ఉంటాయి. ఇందులో గెట్ ఈ పాన్ అనే దానిపై క్లిక్ చేయాలి. తర్వాత మన ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి కంటిన్యూ అనే బటన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ జనరేట్ ఆధార్ ఓటీపీపై క్లిక్ చేస్తే మన మొబైల్ కి ఓటీపీ అయితే వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి. 

ఆ తర్వాత మనకు సంబంధించిన ఆధార్ సంబంధిత డీటైల్స్ అయితే కనిపిస్తాయి. ఆధార్ లో ఉన్న డేటాబేస్ ప్రకారమే ఇక్క జనరేట్ అవుతుంది. ఇక్కడ ఈ మెయిల్ ఐడీ లింక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఆ తర్వాత కంటిన్యూపై క్లిక్ చేయాలి. అప్పుడు మన రిక్వెస్ట్ అనేది విజయవంతంగా సబ్మిట్ అవుతుంది. అక్ నాలెడ్జ్ మెంట్ నెంబర్ కూడా ఇస్తారు. అది సేవ్ చేసుకోండి. మీరు ఒక గంట సేపు తర్వాత పాన్ కార్డును అయితేే డౌన్ చేసుకోవచ్చు. 

డౌన్ లోడ్ చేసుకునే విధానం :

మన డీటైల్స్ ఇచ్చిన తర్వాత ఒక గంట సేపు వేచి ఉండాలి. ఆ తర్వాత వెబ్ సైట్ ఓపెన్ చేసి Instant ePancard పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత డౌన్ లోడ్ పాన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అక్కడ మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు ఆధార్ కార్డు లింక్ ఉన్న ఫోన్ నెంబర్ కి ఓటీపి వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి. అప్పుడు మీకు పాన్ కార్డు అయితే జనరేట్ అవుతుంది. దానిని మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇన్ స్టంట్ పాన్ కార్డును నిమిషాల్లోనే పొందచ్చు. ఫిజికల్ పాన్ కార్డుకు కూడా మీరు తర్వాత అప్లయ్ చేసుకోవచ్చు.

Leave a Comment