Massive Notification of Electricity Department 2025 Full Details

విద్యుత్ శాఖలో భారీ స్థాయిలో ఉద్యోగాలు

నిరుద్యోగులకు విద్యుత్ శాఖ గుడ్ న్యూస్ అందించింది. ఈ కొత్త సంవత్సరంలో ఓ సూపర్బ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ ని అస్సలు వదులుకోవద్దు. భారీ స్థాయిలో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలను అయితే విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఎక్స్ పీరియన్స్ కూడా అవసరం లేదు. జాబ్ లో చేరగానే లక్ష రూపాయలకు పైగా జీతం అయితే వస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని మన సొంత జిల్లాల్లోనే జాబ్ పోస్టింగ్ కూడా పొందవచ్చు. అన్ని కూడా పర్మనెంట్ జాబ్. ఈ పోస్టులకు సంబంధించి ఎవరెవరు అప్లయ్ చేసుకోవాలి? ఎలా అప్లయ్ చేసుకోవాలి? సెలక్షన్ ప్రాసెస్ ఏంటీ? అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Electricity Department ఖాళీల వివరాలు:

విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ప్రొబెషనరీ ఆఫీసర్స్ కి సంబంధించి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇవి పీవో స్థాయి ఉద్యోగాలు. ఈ పోస్టులకు సంబంధించి ఖాళీల వివరాలు చూసుకుంటే మొత్తంగా 350 ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ జాబ్ కి సెలెక్ట్ అయితే బేసిక్ పేనే 40,000 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కూడా ఇస్తారు. అన్ని కలుపుకుంటే సంవత్సరానికి రూ.13 లక్షలు అయితే ప్యాకేజీ ఉంటుంది. అంటే నెలకు రూ.1.15 లక్ష జీతం పొందవచ్చు.  

వయస్సు:

ఈ జాబ్ కి అప్లయ్ చేసే అభ్యర్థుల ఏజ్ విషయానికి వస్తే జనవర్ ఫస్ట్ 2025 నాటికి మినిమమ్ ఏజ్ అనేది 18 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్టంగా జనరల్ అభ్యర్థులకు 25 ఏళ్ల లోపు ఉండాలి. ఓబీసీ వారు అయితే 28 ఏళ్లలోపు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 30 సంవత్సరాల వరకు అప్లయ్ చేసుకోవచ్చు. 

Electricity Department ఖాళీలు:

మొత్తం ఖాళీలు : 350 

జనరల్ : 143

ఈడబ్ల్యుఎస్: 35

ఓబీసీ(ఎన్సీఎల్): 94

ఎస్సీ: 52

ఎస్టీ: 26

దివ్యాంగులకు కూడా పోస్టులు కేటాయించినట్లు నోటిఫికేషన్ లో చెప్పడం జరిగింది. 

ఈ జాబ్స్ కి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే.. మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర స్త్రీ, పురుషులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

దరఖాస్తులకు చివరి తేదీ: 31-1-2025

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు జాబ్ పోస్టింగ్ ఇస్తారంటే.. ఆంధ్రప్రదేశ్ వాళ్లకు మచిలీపట్నంలో, తెలంగాణ వారికి హైదరాబాద్ లో పోస్టింగ్ ఉంటుందని నోటిఫికేషన్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సంస్థకు సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా ఏదైతే యూనిట్స్ అండ్ ఆఫీసెస్ ఉన్నాయో వీటికి సంబంధించిన లోకెషన్స్ లో మనకు పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. 

సెలెక్షన్ ప్రాసెస్:

సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు సెలెక్ట్ చేస్తారు. కంప్యూటర్ బెస్డ్ ఎగ్జామ్ లో 125 ప్రశ్నలు ఉంటాయి. 120 నిమిషాలు సమయం అయితే కేటాయిస్తారు. అందులో 100 టెక్నికల్ ప్రశ్నలు, మిగితా 25 ప్రశ్నలు జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి ఉంటాయి. ప్రతి కరెక్ట ప్రశ్నకు 1 మార్కు, అలాగే ప్రతి రాంగ్ ఆన్సర్ కి ¼ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ప్రశ్నలు ఉంటాయి. ఈ ఎగ్జామ్ లో పాస్ అయిన వారికి 1:5 రేషియోలో ఇంటర్వ్యూకు పిలవడం జరుగుతుంది.  

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్:

ఈ ఎగ్జామ్స్ కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే జనరల్, ఓబిసి, ఈడబ్ల్యుఎస్ వారు మినిమమ్ 60 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అది ఏ విభాగంలో అంటే ఎలక్ట్రానిక్స్ కాని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కాని ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ విభాగాల్లో పాస్ అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల అయితే జస్ట్ పాస్ అయిన వారు అప్లయ్ చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ చదువుతున్న వారికి కూడా ఈ ఎగ్జామ్ లో అవకాశం కల్పించారు. 

అప్లికేషన్ ఫీజు:

అప్లికేషన్ కి ఫీజుకు సంబంధించిన డీటైల్స్ చూసుకున్నట్లు అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ, ఎక్స్ సర్వీస్ మెన్ కాండేట్స్ కి ఎలాంటి ఫీజు ఉండదు. మిగితా అభ్యర్థులు రూ.1180 ఫీజు ఆన్ లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది.

Leave a Comment