What is required Documents for a new ration card In Andhra Pradesh ? Who is eligible?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 2వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకుంటామని ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఈ ఉత్తర్వుల ప్రకారం కొత్తగా దరఖాస్తు చేేసుకోవాలనుకున్న వారు చేసుకోవచ్చు. అయితే రేషన్ కార్డులో ఎన్ని రకాల రేషన్ కార్డులు ఉన్నాయి..ఏ రేషన్ కార్డుకు ఎవరు అర్హులు.. ఏ పత్రలు కావాలి? ఆల్రెడీ కుటుంబంలో రేషన్ కార్డులో ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉంటే వారు వేరే రేషన్ కార్డు కోసం ఏ పత్రాలు కావాలి? అలాగే పిల్లలు పుట్టిన వారు వారి పిల్లల పేర్లను రేషన్ కార్డులో చేర్చాలంటే ఏ పత్రాలు కావాలి? తదితర పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాము.. 

కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున కుటుంబం.. కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెంది ఉండాలి. అంటే వారి ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి. రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు ఐదు రకాల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. అవి

రేషన్ కార్డు రకాలు:

1.దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్)

2.అంత్యోదయ అన్న యోజన (ఏఏవై)

3.అన్నపూర్ణ పథకం

4.ప్రాధాన్యత గ్రుహం (పీహెచ్ హెచ్)

5.ప్రాధాన్యత లేని గ్రుహాలు (ఎన్ పీహెచ్ హెచ్)

ఈ ఐదు రకాల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. ఏ రేషన్ కార్డుకు ఎవరు అర్హులు. ఏ పత్రాలు కావాలి అనేది ఇప్పుడు చూద్దాం.. 

1.దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్)

దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) కార్డు అంటే తెల్ల రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే వారు గ్రామీణ ప్రాంతాల్లో అయితే నెలకు రూ.10 వేల రూపాయల ఆర్థిక ఆదాయ కలిగి ఉండాలి. అదే మున్సిపాలిటీ ప్రాంతం అయితే నెలకు రూ.15 వేలు ఆదాయం కలిగి ఉండాలి. 7 ఎకరాలకు మించి భూమి ఉండకూడదు. కారు ఉండకూడదు. ఇన్ కంట్యాక్స కట్ట కూడదు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే వారు ఉండకూడదు. 

ఈ బీపీఎల్ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే వారు ఈ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డు దరఖాస్తు ఫారమ్, ఫ్యామిలీ ఫొటో, ఆధార్ కార్డు, కుటుంబ సభ్యుల జాబితా, ఆధాయ ధ్రువీకరణ పత్రం, మొబైల్ నెంబర్. ఈ పత్రాలతో గ్రామ, వార్డు సచివాలయాల్లో తెల్ల రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

2.అంత్యోదయ అన్న యోజన (ఏఏవై)

ఇది దేశంలో అత్యంత పేదరికం కలిగినటి వంటి కుటుంబాల కోసం కేటాయించిన కార్డు. ఈ రేషన్ కార్డు ద్వారా కుటుంబానికి నెలకు 35 కేజీల రేషన్ అనేది అతి తక్కువ ధరకే ఇవ్వడం జరుగుతుంది. అన్ని పథకాలకు వీరు అర్హత కలిగి ఉంటారు. అంత్యోదయ అన్న యోజన కార్డుకు దరఖాస్తు చేసుకునే వారి కుటుంబ ఆదాయం సంవత్సరానికి కేవలం రూ.15 వేలు మాత్రమే ఉండాలి. కుటుంబంలో ఎవరి పేరుతోనూ భూమి ఉండకూదు. ఇలాంటి వారు ఈ కార్డుకు అర్హులు. అంత్యోదయ అన్న యోజన కార్డుకు దరఖాస్తు చేసుకునే వారు ఈ పత్రాలు అయితే సమర్పించాలి. దరఖాస్తు ఫారమ్, ఫ్యామిలీ గ్రూప్ ఫొటో, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, కుటుంబం ఇన్ కమ్ సర్టిఫికెట్, మొబైల్ నెంబర్ సమర్పంచాల్సి ఉంటుంది. 

3.అన్నపూర్ణ పథకం రేషన్ కార్డు

ఈ రేషన్ కార్డు 65 సంవత్సరాలు పైబడిన వ్రుద్ధులు. అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డు కిందకు రాని అంటే వారి కంటే మరింత పేదరికం కలిగిన కుటుంబాలకు అన్నపూర్ణ పథకం రేషన్ కార్డు అనేది ఇస్తారు. ఈ కార్డుకు నెలకు 10 కేజీల బియ్యాన్ని అయితే ఇస్తారు. ఈ రేషన్ కార్డు కావాల్సిన వారు కుటుంబంలో ఎటువంటి ఆదాయం కలిగి ఉండకూడదు. కేవలం ప్రభుత్వం నుంచి పెన్షన్, ఇతరాత్ర మాత్రమే కలిగి ఉండాలి తప్ప ఎటువంటి ఆదాయం ఉండకూడదు. కుటుంబంలోని వ్యక్తుల పేరుపైన ఎటువంటి భూమి ఉండకూడదు. ఎవరైతే 65 ఏళ్లు పైబడి పేదరికంలో ఉన్న వారు ఈ అన్నపూర్ణ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు, ఫ్యామిలీ ఫొటో, ఇన్ కమ్ సర్టిఫికెట్, మొబైల్ నెంబర్ ఉండాలి. 

4.ప్రాధాన్యత గ్రుహం (పీహెచ్ హెచ్)

ప్రాధాన్యత గ్రుహం (పీహెచ్ హెచ్) కార్డుదారులకు ప్రతినెలా 5 కేజీల బియ్యం అయితే ఇస్తారు. అంత్యోదయ, అన్నపూర్ణ కంటే పేదరికం కలిగిన వారికి ఈ కార్డు అయితే ఇస్తారు. ఈ కార్డుకు ఎవరు అర్హులు అంటే ట్రాన్స్ జెండర్, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వ్యక్తులు, ఆదిమ గిరిజన సమూహాలకు చెందిన వ్యక్తి, వితంతువు పెన్షన్ తీసుకునే వారు, బిక్షాటన చేస్తూ జీవిస్తున్న వారు ఈ పీహెచ్ హెచ్ కార్డుకు అర్హులు. ఈ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే వారు దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు, ఇన్ కమ్ సర్టిఫికెట్, గ్రూప్ ఫొటో, మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి. 

5.ప్రాధాన్యత లేని గ్రుహాలు (ఎన్ పీహెచ్ హెచ్)

ప్రాధాన్యత లేని గ్రుహాలు (ఎన్ పీహెచ్ హెచ్) కార్డుకు ప్రభుత్వం నిర్దేశించినటు వంటి అర్హత ప్రమాణాలు లేని కుటుంబాల వారు అంటే ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వారికి ఈ రేషన్ కార్డు ఇస్తారు. ఈ కార్డు పొందిన వారు ప్రభుత్వం నుంచి ఎటువంటి సబ్సిడీలు కానీ, బియ్యం కాని పొందలేరు. కేవలం కుటుంబ గుర్తింపు పత్రంగా మాత్రమే ఈ కార్డు ఉంటుంది. ప్రాధాన్యత లేని కార్డు పొందాలంటే దరఖాస్తు ఫారం, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, ఫ్యామిలీ గ్రూప్ ఫొటో అలాగే మొబైల్ నెంబర్ ఇచ్చినట్లు అయితే ఈ కార్డు పొందవచ్చు. 

ఇక కుటుంబంలో నుంచి వేరై కొత్త రేషన్ కార్డు తీసుకోవాల్సిన వారు స్లిప్టింగ్ ఫారమ్ నింపి ఆధార్ కార్డు, ఫొటో, మొబైల్ నెంబర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే పిల్లల పేర్లు యాడ్ చేయాలనుకున్న వారు తమ పిల్లల ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, దరఖాస్తు ఫారమ్ తో జత చేసి సచివాలయాల్లో సమర్పించాలి. ఇలా దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు విచారణకు వస్తారు. అప్పుడు దరఖాస్తులో చెప్పిన వివరాలు సరిగ్గా ఉంటే రేషన్ కార్డుకు అర్హులుగా గుర్తిస్తారు. ఆ తర్వాత రేషన్ కార్డు మంజూరు చేస్తారు

Leave a Comment