How to Apply for Telangana Ration Cards?

తెలంగాణ రేషన్ కార్డుల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించింది. ఈనెల 26వ తేదీ నుంచి రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే చాలా మందికి ఇది నిజమేనా అనే డౌట్ ఉంటుంది.. ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్నో హామీలు అయితే ఇస్తుంటాయి. అవి నెరవేర్చడానికి చాలా సమయంలో పడుతుంది. అయితే ఇక్కడ రేషన్ కార్డుల విషయంలో ఇతర మంత్రులు హామీ ఇస్తే నమ్మకపోవచ్చు కానీ, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ విషయం చెప్పడంతో కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉంది. 

ఈ కొత్త రేషన్ కార్డులు ఈనెల 26 నుంచి ఇస్తామని అయితే చెప్పారు. అయితే ఈలోపే దరఖాస్తులు స్వీకరించవలసి ఉంటుంది. విధివిధానాలను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ విధివిధానాలను ఖరారు చేస్తారా? లేదా గతంలో ఉన్న విధివిధానాలనే అమలు చేస్తారా? దరఖాస్తులను ఏ విధంగా స్వీకరిస్తారు? ఆన్ లైన్ లో స్వీకరిస్తారా? లేదా ఆఫ్ లైన్ లో స్వీకరిస్తారా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈనెల 26 తేది నుంచి కొత్త రేషన్ కార్డులను ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే ఇక్కడ దరఖాస్తులను ఈ నెల 15 నుంచే స్వీకరించనున్నట్లు సమాచారం. అయితే ఈ దరఖాస్తులను ఆన్ లైన్ లో స్వీకరిస్తారా? లేదా ఆఫ్ లైన్ లో స్వీకరిస్తారా? అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆన్ లైన్ లో స్వీకరించేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఆన్ లైన్ లో స్వీకరించుకుండా ఆఫ్ లైన్ లోనే గ్రామ సభలు, వార్డు సభలు, బస్తీ సభల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.. దీనికి సంబంధించి విధివిధనాలు కూడా ఖారారు చేసే అవకాశం ఉంది.  

ఇక అర్హతలు నియమ, నిబంధనల విషయానికి వస్తే.. అర్హతల్లో ఎలాంటి కొత్త నియమ, నిబంధనలు తీసుకురావొద్దని, గతంలో ఉన్న నిబంధనలనే పాటించి కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మనకు తెలుస్తోంది. అంటే 2014లో ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఒక జీవో అయితే జారీ చేయడం జరిగింది. ఈ జీవోలనే పాటిస్తూ కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. 

ఈ విధంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఈనెల 15 వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది. దరఖాస్తులను ఆన్ లైన్ లో కాకుండా.. అంటే మీసేవకు, ఈసేవకు పరుగులు పెట్టి అక్కడ లైన్ లో నిలబడి దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేకుండా గ్రామ పంచాయతీ దగ్గరనే గ్రామ సభల్లో, ఒకవేళ వార్డుల్లో అయితే వార్డు కార్యాలయాల దగ్గర వార్డు సభలను, డివిజన్ లో అయితే డివిజన్ సభలను నిర్వహించి ఆఫ్ లైన్ లోనే దరఖాస్తులను స్వీకరించనున్నారు. 

ఈ విధంగా స్వీకరించిన దరఖాస్తులను అర్హతలుగా గతంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్షిక ఆదాయాన్ని కూడా ప్రభుత్వం ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని కొన్ని పత్రికల్లో రావడం అనేది జరిగింది. దానిని బేస్ చేసుకుంటే వార్షిక ఆదాయాన్ని పెంచుతారా? లేదా తగ్గిస్తారా అనే డౌట్ ప్రజల్లో ఉండేది. కొత్త నిబంధనలు ఏవీ తీసుకురావడం లేదని, గతంలో ఉన్న నిబంధనలనే అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం సిద్ధమైనట్లు ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది. 

ఇక్కడ పాత రేషన్ కార్డులో మార్పులు, చేర్పులకు కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తున్నట్లు తెలిసింది. మార్పులు చేర్పులు అంటే కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి లేదా పాత రేషన్ కార్డులో భార్య పేరు నమోదు చేసుకోవడానికి అదే విధంగా వారికి పిల్లలు ఉన్నట్లు అయితే ఆ పిల్లల పేర్లను చేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. ఈ విధంగా ఇప్పటికే మార్పుల చేర్పుల కోసం 18 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వం దగ్గర సమాాచారం ఉంది. వారందరికీ కూడా మార్పులు చేర్పులకు అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. ఒకవేళ పాత రేషన్ కార్డుల్లో ఎవరైన చనిపోయిన వారు ఉంటే వారిని తొలగించడం కొత్త వారిని చేర్చడం అనే ప్రక్రియ కూడా ప్రభుత్వం చేపడుతున్నట్లు తెలుస్తోంది. 

ఇక కొత్త రేషన్ కార్డుల కోసం 10 లక్షల దరఖాస్తులు అయితే రావొచ్చని అంచనా.. వీరందరికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఏదీ ఏమైన ఈనెల 15వ తేదీ నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లయితే మీరు ఒక తెల్లపేపర్ పైన దరఖాస్తులు రాయవచ్చు. లేదా ప్రభుత్వం ఏదైనా ప్రింటెడ్ ప్రొఫార్మాను రూపొందిస్తే దానిని పూర్తి చేసి దరఖాస్తులను అందజేయవలసి ఉంటుంది.

Leave a Comment