Aadhaar Center Jobs notification || UIDAI AADHAR Center Jobs Notification 2025

నిరుద్యోగులకు శుభవార్త.. ఆధార్ సెంటర్ ఉద్యోగాలు రావడం జరిగింది. ఈ సంవత్సరంలో ఫస్ట్ టైమ్ ఆదార్ సెంటర్ నుంచి ఆధార్ సూపర్ వైజర్, ఆధార్ ఆపరేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.  మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఉద్యోగాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఉద్యోగాలు విడుదల అయ్యాయి. ఇంటర్ పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. 

మీ ప్రాంతంలో మీరు ఆధార్ సెంటర్ ఓపెన్ చేసుకోవాలంటే మీకు UIDAI ద్వారా అధికారం పొందిన టెస్టింగ్ & సర్టిఫైయింగ్ ఏజెన్సీ ద్వారా జారీ చేయబడిన ఆధార్ ఆపరేటర్/సూపర్వైజర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఆ సర్టిఫికెట్ ద్వారా మీరు ఆధార్ సెంటర్ పెట్టుకోవచ్చు. మీ సొంత గ్రామంలో మీరు నెలకు 30 నుంచి 40 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు. 

ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఆధార్ కార్డుతోనే ముడిపడి ఉంది ఏ కొత్త స్కీమ్ వచ్చిన కచ్చితంగా ఆధార్ అప్డేట్ చేయించుకోవాలి. ఆధార్ కేవైసీ చేయించుకోవాలి. ఆధార్ కి ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలి. పాన్ నెంబర్ లింక్ చేసుకోవాలి. ఇవన్నీ చాలా మందికి తెలియదు. ఇవి చేసుకోవడానికి కొంత వరకు ఛార్జెస్ నియమిస్తారు. మీకు జీతం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. 

పోస్టుల వివరాలు:

డిస్ట్రిక్ట్ ఆధార్ సూపర్ వైజర్ / ఆపరేటర్ 

అర్హత:

ఇంటర్ (లేదా) టెన్త్ తో పాటు రెండేళ్లు ఐటీఐ (లేదా) టెన్త్ తర్వాత మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కలిగి ఉండాలి. దీంతో పాటు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి.  

వయస్సు:

డిస్ట్రిక్ట్ ఆధార్ సూపర్ వైజర్ / ఆపరేటర్ ఉద్యోగానికి 18 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

దరఖాస్తు విధానం:

దరఖాస్తు చేసుకోవడానికి మీ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, పాన్ నెంబర్ తో పాటు రెజ్యూమ్, ఆధార్ సూపర్ వైజర్ సర్టిఫికెట్ ని అప్ లోడ్ చేయవలసి ఉంటుంది. 

దరఖాస్తు తేదీలు:

31-01-2025 లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

పూర్తి వివరాలకు వెబ్ సైట్ ని సందర్శించండి.

ఆధార్ సూపర్ వైజర్ సర్టిఫికెట్ పొందడం ఎలా?

ఆధార్ సూపర్ వైజర్ సర్టిఫికెట్ పొందడం కోసం ఫస్ట్ అఫీషియల్ ఆధార్ వెబ్ సైట్ పై క్లిక్ చేయండి. 

అక్కడ లాగిన్ అప్షన్ పై క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. 

అక్కడ ఒక మనకు డాష్ బోర్డ్ కనిపిస్తుంది. అక్కడ offline eKYC పై క్లిక్ చేయాలి. అక్కడ ఒక షేర్ కోడ్ ని క్రియేట్ చేసుకోవాలి. అక్కడ ఫైల్ ని డౌన్ లోడ చేసుకోవాలి. అయితే ఆ జిప్ ఫైల్ ని మనం ఓపెన్ చేయకూడదు. 

ఆ తర్వాత మనం వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఇక్కడే మనం ఆ ఎగ్జామ్ కి సంబంధించిన సర్టిఫికెట్ పొందడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ న్యూయూజర్ పై క్లిక్ చేసి మనం డౌన్ లోడ్ చేసిన ఫైల్ ని అప్ లోడ్ చేయవలసి ఉంటుంది. అప్పుడు మనకు ఒక యూజర్ ఐడీ వస్తుంది. మన బేసిక్ డీటైల్స్ ఫిల్ చేయాలి. దీనికి ఫీజు ఉంటుంది.

Leave a Comment