AAI Junior Executive Recruitment 2025 ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేేషన్ ద్వారా జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 309 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 25వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. అభ్యర్థులు మే 24వ తేదీ వరకు ఆన్ లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు.
AAI Junior Executive (Air Traffic Control) Recruitment 2025
పోస్టుల వివరాలు:
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి Junior Executive (Air Traffic Control) పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 309 ఖాళీలు ఉన్నాయి.
కేటగిరి వారీగా పోస్టులు | ఖాళీలు |
UR | 125 |
EWS | 30 |
OBC | 72 |
SC | 55 |
ST | 27 |
PwBD | 07 |
అర్హతలు:
AAI Junior Executive (Air Traffic Control) Recruitment 2025 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
పోస్టు పేరు | అర్హతలు |
Junior Executive (Air Traffic Control) | BSc(Maths & Physics) లేదా కనీసం ఒక సెమిస్టర్ లో ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టులుగా ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. 10+2 స్థాయిలో ఇంగ్లీష్ రాయడం మరియు మాట్లాడటం వచ్చి ఉండాలి. |
వయస్సు:
AAI Junior Executive (Air Traffic Control) Recruitment 2025 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
AAI Junior Executive (Air Traffic Control) Recruitment 2025 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.1,000/- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
కేటగిరి | అప్లికేషన్ ఫీజు |
UR / EWS / OBC | రూ.1,000/- |
SC / ST / PwBD / Women | ఫీజు లేదు |
ఎంపిక ప్రక్రియ:
AAI Junior Executive (Air Traffic Control) Recruitment 2025 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను దరఖాస్తు ధ్రువీకరణ / వాయిస్ టెస్ట్ / సైకోయాక్టివ్ సబ్ స్టాన్సెస్ టెస్ట్ / సైకోలాజికల్ అసెస్మెంట్ / ఫిజికల్ టెస్ట్ / బ్యాక్ గ్రౌండ్ వెరిఫికెషన్ టెస్ట్ కి పిలుస్తారు.
1.CBT : కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ లో నోటిఫికేషన్ లో ఇచ్చిన సిలబస్ ఆధారంగా పరీక్ష ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉండదు.
2.అప్లికేషన్ వెరిఫికేషన్ : రాత పరీక్షలో షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ఒరిజనల్ డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది.
3.వాయిస్ టెస్ట్ : కమ్యూనికేషన్ స్కిల్ అంచనా వేసేందుకు ఈ టెస్ట్ నిర్వహిస్తారు.
4.సైకోయాక్టివ్ సబ్ స్టాన్సెస్ టెస్ట్ : కొకైన్, కాానబిన్ వంటి మత్తు పదార్థాలపై పరీక్ష నిర్వహిస్తారు. నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరిగా రావాలి.
5.సైకలాజికల్ అసెస్మెంట్ టెస్ట్ : అభ్యర్థుల మానసిక సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఈ టెస్ట్ నిర్వహిస్తారు.
6.ఫిజికల్ మెడికల్ టెస్ట్: అభ్యర్థులు వైద్య ప్రమానాలనకు అనుగుణంగా ఉన్నారాా లేరా అని నిర్ధారించుకోవడానికి ఈ టెస్ట్ నిర్వహిస్తారు.
7.బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ : అభ్యర్థుల నేపథ్యం గురించి వెరిఫికేషన్ ఉంటుంది.
జీతం:
AAI Junior Executive (Air Traffic Control) Recruitment 2025 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు E-1 లెవెల్ పే స్కేల్ అందజేస్తారు. నెలకు రూ.40,000 – 3% – రూ.1,40,000/- జీతం ఉంటుంది. అన్ని కలుపుకుని నెలకు రూ.1,08,000/- వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం:
AAI Junior Executive (Air Traffic Control) Recruitment 2025 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ప్రారంభ ప్రక్రియ్ ఏప్రిల్ 25వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది.
ముఖ్యమైన తేేదీలు:
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం | 25 – 04 – 2025 |
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేేదీ | 24 – 05 – 2025 |
Notification | CLICK HERE |
Official Website | CLICK HERE |