అంగన్ వాడీ పోస్టులు.. పది పాస్ అయితే చాలు..
నిరుద్యోగ మహిళలకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీ ఉద్యోగాలు అయితే వెలువడ్డాయి. మీ సొంత ఊరిలోనే జాబ్ అనేది పొందవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. అప్లికేషన్ ఫీజు కూడా ఉండదు. మహిళా శిశు సంక్షేమ కార్యాలయంలో ఈ అప్లికేషన్ సమర్పిస్తే చాలు. మీకు అర్హతలు ఉంటే మాత్రం మీకు ఈ ఉద్యోగం వచ్చినట్లే.. మరీ ఈ పోస్టులు ఎక్కడ రిలీజ్ అయ్యాయి. ఎన్ని పోస్టులు ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ లోని రెండు జిల్లాల్లో ఈ అంగన్వాడీ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. దీని గురించి విద్యార్హత, ఎలా అప్లయ్ చేయాలి.. కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవీ అనే దాని గురించి సమగ్ర సమాచారం తెలుసుకుందాం.
ఏపీలోని రెండు జిల్లాల్లో ఈ పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. ఒక జిల్లాలో 116, మరొక జిల్లాలో 100 పోస్టులు ఉన్నాయి. ఏ జిల్లాలో అయితే 116 పోస్టులు ఉన్నాయో అక్కడ వచ్చేసి 11 అంగన్ వాడీ కార్యకర్తలు, 12 మిరీ అంగన్ వాడీ కార్యకర్తలు, 93 వచ్చేసి ఆయా పోస్టులు రిలీజ్ అయ్యాయి.
ఎలిజిబిలిటీ:
ఇక ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ చూసుకుంటే.. 1-7-2024 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. ఒకవేళ మీరు అప్లయ్ చేసుకున్న ప్రదేశంలో 21 సంవత్సరాల వారు ఎవరు లేకపోతే 18 సంవత్సరాలు నిండిన వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
సెలెక్షన్ ప్రాసెస్:
అప్లయ్ చేసిన దరఖాస్తులను పూర్తిగా పరిశీలించి అందులో మెరిట్ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం:
అంగన్ వాడీ – రూ.11,500
మినీ అంగన్ వాడీ – రూ.9000
ఆయాలకు – రూ.7000
విద్యార్హత:
అంగన్ వాడీ కార్యకర్తకు పదో తరగతి పాస్ అయ్యి ఉండాలి. అలాగే మినీ అంగన్ వాడీకి 7వ తరగతి పాస్ ఉండాలి. స్థానికంగా వివాహం చేసుకుని ఉండాలి.
సర్టిఫికెట్లు:
ఇక ఈ పోస్టులు ఏం సర్టిఫికెట్లు కావాలంటే.. పుట్టిన తేదీ, వయస్సు ధ్రువీకర పత్రం, స్థానిక నివాసం కోసం నెటివిటి సర్టిఫికెట్, రెసిడెంట్ సర్టిఫికెట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు మొదలగునవి కావాల్సి ఉంటుంది. పదో తరగతి మార్క్ మెమో. క్యాస్ట్ సర్టిఫికెట్, దివ్యాంగులు అయితే సదరం సర్టిఫికెట్. వితంతువు అయితే భర్త డెత్ సర్టిఫికెట్ కావాలి.
ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకొని అందులోని విషయాలను పూర్తి చేయాలి. అలాగే సర్టిఫికెట్లపైన గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయించుకోవాలి. అలా చేసిన సర్టిఫికెట్లు మాత్రమే చెల్లుతాయి.
జాబ్స్ ఎక్కడ రిలీజ్ అయ్యాయంటే:
ఆంధ్రప్రదేశ్ లోని రెండు జిల్లాలో అయితే ఈ అంగన్ వాడీ పోస్టులు రిలీజ్ అయ్యాయి. అన్నమయ్య జిల్లాలో 116 పోస్టులు రిలీజ్ అయ్యాయి. అక్కడ వచ్చేసి 11 అంగన్ వాడీ కార్యకర్తలు, 12 మిరీ అంగన్ వాడీ కార్యకర్తలు, 93 వచ్చేసి ఆయా పోస్టులు ఉన్నాయి. అల్లూరు సీతరామరాజు జిల్లాలో 100 పోస్టులు రిలీజ్ అయ్యాయి. పాడేరు, రంపచోడవం డివిజన్లలో ఈ పోస్టులు అయితే ఉన్నాయి.