Andhra Pradesh New Ration Card Enrollment Procedure In 2025 | AP Ration Card Apply Process

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్త అందించబోతుంది. ప్రధానంగా Ration Card కు సంబంధించి అప్ డేట్ తీసుకురానుంది. 2024లో కొత్తగా వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేయలేదు. ఇప్పుడు వచ్చేసి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి.. రేషన్ కార్డుల్లో ఏమైన తప్పులు ఉన్నా.. కొత్తగా ఏమైనా యాాడ్ చేసుకోవాలన్నా.. లేక ఏమైన సపరేట్ చేసుకోవాలన్న ఇప్పుడు కొత్తగా ఆప్షన్స్ అయితే డిసెంబర్ నుంచి రావడం జరిగింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్లికేషన్ సమర్పించవచ్చు. ప్రధానంగా నాలుగు కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

కొత్త ఆప్షన్లు ఏంటీ? New Options For Ration card In Andhra Pradesh

ప్రధానంగా డిసెంబర్ 2 నుంచి 28 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో New Ration card కోసం, లేదా రేషన్ కార్డులో కరెక్షన్ లేదా కొత్తగా పెళ్లి అయిన వారిని యాడ్ చేసుకోవడం లేదా చనిపోయిన వారిని తీసివేయడం అనే నాలుగు ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. అయితే గతంలో ఇచ్చిన విధంగా ఇస్తుందా లేదా కొత్తగా ఏవైనా మార్పులు చేస్తుందా అనేది వేచి చూడాలి. ఇక్కడ ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయంలో ఈ వెబ్ సైట్ అందుబాటులో ఉంది. డిసెంబర్ 28 లోపు మాత్రమే ఈ అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. అలా అప్లయి చేసుకున్న తర్వాత సంక్రాంతికి కొత్త రేషన్ కార్డు అయితే జారీ చేయడం జరుగుతుంది. 

ప్రధానంలో ration card సంబంధించి నాలుగు ఆప్షన్లు అయితే ఉంటాయి. మొదటిగా కొత్త రేషన్ కార్డు కోసం అప్లయ్ చేస్తున్న వారికి ఏ డాక్యుమెంట్స్ కావాలి? అంటే ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండి ఆధార్ కార్డు ద్వారా గ్రామ, వార్డు సచివాలయంలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆధార్ కార్డు జిరాక్స్, అప్లికేషన్ తీసుకెళ్లి గ్రామ, వార్డు సచివాలయంలో ఇస్తే కొత్త రేషన్ కార్డు కోసం అప్లయి చేస్తారు. ఈ కొత్త రేషన్ కార్డు సంక్రాంతికి జారీ చేస్తారు. మనం అప్లయి చేసిన తర్వాత ఒక టిన్ నెంబర్ అనేది వస్తుంది. గతంలో వాలంటరీ వ్వవస్థ ఉండేది కాబట్టి వారు వచ్చి ఈ టి నెంబర్ చేసేవారు. అలా కాకుండా సచివాలయ ఉద్యోగులకే ఈ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడే మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డులో కానీ, రేషన్ కార్డులో కానీ ఏవైన తప్పులు ఉంటే అక్కడ ఈకేవైసీ చేసుకోవచ్చు. 

అలాగే మనకు ఉన్నటువంటి రేషన్ కార్డులో వారు సపరేట్ చేసుకోవడానికి గతంలో వైసీపీ ప్రభుత్వం అయితే స్ల్పట్టింగ్ అనే ఆప్షన్ పెట్టింది. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ఆప్షన్ ని ఎనేబుల చేస్తారో లేదో వేచిచూడాలి. ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. ఎవరైతే స్ల్పట్టింగ్ చేసుకోవాలనుకుంటున్నారో వారు.. వారి ఆధార్ కార్డులను, అలాగే వారి పేరెంట్స్ ఆధార్ కార్డులను తీసుకెళ్లి అక్కడ విభజన అప్లికేషన్ ఫామ్ ఇస్తే సచివాలయంలో వారికి అప్లయ్ చేయడం జరుగుతుంది. 

Ration card లో యాడింగ్..

ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులో పెళ్లి అయిన అమ్మాయి కావోచ్చు.. అలాగే చిన్న పిల్లలు కావచ్చు యాడింగ్ చేసుకోవాలంటే వారికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే.. ప్రధానంగా గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పెళ్లి అయిన వారికి మ్యారేజ్ సర్టిఫికెట్, మ్యారేజ్ ఫొటో అనేది అడాప్ట్ చేయడం జరిగింది. ఒక వేళ చదువుకున్న అమ్మాయిలకు అయితే మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటుంది. మరి మ్యారేజ్ సర్టిఫికెట్ లేని వారు వెడ్డింగ్ కార్డు, వారి వెడ్డింగ్ ఫొటో అనేది అప్ లోడ్ చేస్తే సరిపోయేది. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఎలాంటి ఆప్షన్స్ పెడుతుందో చూడాలి. 

అలాగేే రేషన్ కార్డులో చిన్న పిల్లలను యాడ్ చేయాలంటే వారి యొక్క ఆధార్ కార్డు ఉండాలి.. దీంతో పాటు వారి బర్త్ సర్టిఫికెట్ ఉండాలి. ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్ ఉంటే వారి కార్డులో చిన్నపిల్లలను యాడ్ చేసుకోవచ్చు. 

ఎవరైతే వితంతువులు ఉంటారో.. వారు పెన్షన్ పొందాలంటే.. వారి కార్డులో చనిపోయిన భర్త  పేరును డిలీట్ చేయాల్సి ఉంటుంది. రిమూవ్ చేసుకోవాలంటే అందుకు కూడా డెత్ ఆప్షన్ అనేది ఉంటుంది. అప్లికేషన్ లో డిలిషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎవరైతే వితంతువు పెన్షన్ పొందాలనుకుంటున్నారో వారు కచ్చితంగా గ్రామ, వార్డు సచివాలయంలో ఈ అప్లికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. వారు పెన్షన్ పొందాలనుకుంటున్న వారి ఆధార్ కార్డు, భర్త డెత్ సర్టఫికెట్, రేషన్ కార్డు తీసుకొని వెళితే అక్కడ భర్తను రిమూవ్ చేస్తారు. 

 ఒంటరి మహిళలకు సంబంధించి..

ఇక ఒంటరి మహిళలకు సంబంధించి రేషన్ కార్డు అప్లయ్ చేయాలంటే వారు ఎక్కడా ఏ రేషన్ కార్డులో లేకుంటే ఒంటరి మహిళ ఆప్షన్ ద్వారా ఒంటరి మహిళ రేషన్ కార్డును అయితే ఇవ్వడం జరుగుతుంది. వారికి సంబంధించి వారి ఆదార్ కార్డును తీసుకెళ్లి అప్లయ్ చేసుకోవచ్చు. ఒకవేళ భర్త ఉండి విడిపోతే.. కూడా అందులో ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి. ప్రధానంగా రేషన్ కార్డుకు సంబంధించి పూర్తి సమాచారం ఇది..

Leave a Comment