AP Anganwadi Jobs 2025 | అల్లూరీ సీతారామరాజు జిల్లాలో అంగన్ వాడీ పోస్టులకు నోటిఫికేషన్

AP Anganwadi Jobs 2025 ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అంగన్ వాడీ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 114 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.  అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. 

AP Anganwadi Jobs 2025 

పోస్టుల వివరాలు: 

ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, చింతూరు, రంపచోడవరం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్ వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం పోస్టులు 114 ఉన్నాయి. 

పోస్టు పేరుఖాళీలు
అంగన్ వాడీ వర్కర్07
అంగన్ వాడీ హెల్పర్56
మినీ అంగన్ వాడీ వర్కర్27
పీఎం జన్ మన్ పథకం కింద కొత్తగా మంజూరైన అంగన్ వాడీ కేంద్రాల్లో అంగన్ వాడీ వర్కర్24

అర్హతలు : 

AP Anganwadi Jobs 2025 అంగన్ వాడీ వర్కర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అంగన్ వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 7వ ఉత్తీర్ణులై ఉండాలి.  ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు స్థానికంగా నివసిస్తున్న వివాహిత మహిళలు అర్హులు. 

వయస్సు: 

AP Anganwadi Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులు ఉన్న ప్రాంతాల్లో 21 ఏళ్లు కలిగిన అభ్యర్థి లేకపోతే, 18 ఏళ్లు నిండిన వారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 

ఎంపిక ప్రక్రియ: 

AP Anganwadi Jobs 2025 పోస్టులకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ పోస్టులను ఎటువంటి పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ మరియు మెరిట్ ఆధారంగా ఎంపికే చేస్తారు. మొత్తం 100 మార్కుల ఉంటాయి. 

10వ తరగతి మెరిట్ 50 మార్కులు
ప్రీ స్కూల్ ట్రైనింగ్ పొందితే5 మార్కులు
విడో5 మార్కులు
చిన్న పిల్లలతో కూడి విడో5 మార్కులు
అనాథలుగా ఉండే అభ్యర్థికి 10 మార్కులు
దివ్యాంగ అభ్యర్థి5 మార్కులు
ఇంటర్వ్యూకు20 మార్కులు
మొత్తం100 మార్కులు

జీతం : 

AP Anganwadi Jobs 2025 అంగన్ వాడీ వర్కర్ కు రూ.11,500/-, మిని అంగన్ వాడీ వర్కర్ కి రూ.9,000/-, అంగన్ వాడీ హెల్పర్ కి రూ.7,000/- జీతం ఇస్తారు. 

దరఖాస్తు విధానం : 

AP Anganwadi Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అభ్యర్థి స్వయంగా వెళ్లి సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయంలో తమ అప్లికేషన్ అందజేయాలి. బయోడేటాతో పాటు అన్ని విద్యార్హత, ఇతర సర్టిపికెట్లు జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ అఫీసర్ సంతకం చేయించి ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆఫీస్ లో అప్లికేషన్ ఇవ్వాలి. 

  • దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ : 10 – 04 – 2025

కావాల్సిన డాక్యుమెంట్స్: 

  • డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్
  • 10వ తరగతి సర్టిఫికెట్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • రెసిడెన్స్ సర్టిఫికెట్
  • వివాహ ధ్రువీకరణ పత్రం
  • సదరం సర్టిఫికెట్(దివ్యాంగులకు)
  • అనాధ సర్టిఫికెట్(ఉంటే)
  • పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
ApplicationCLICK HERE

Leave a Comment