AP DSC latest Update : ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ పోస్టుల విషయంలో తాజా అప్ డేట్ వచ్చింది. ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న AP DSC Notification పై విద్యాశాఖ నుంచి కీలక ప్రకటన వెలువడింది. మార్చి నెలలో AP DSC Notification విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకొచ్చి ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో అంటే.. జూన్ నాటికి ఉపాధ్యాయ పోస్టుల నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించింది.
AP DSC Notification 2025
పోస్టుల వివరాలు :
ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 టీచర్ల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ పోస్టులలో జిల్లా పరిషత్, మండల పరిషత్ మరియు మున్సిపల్ స్కూల్స్ లో 14,066 పోస్టులు, రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, బీసీ, గిరిజిన స్కూళ్లలో 2,281 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మార్చిలో AP DSC Notification ను ఎలాంటి అడ్డంకులు లేకుండా విడుదల చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. పోస్టుల కేటాయింపులు చూస్తే..
మొత్తం పోస్టుల సంఖ్య : 16,347
➤సెకండరీ గ్రేడ్ టీచర్లు – 6,371
➤స్కూల్ అసిస్టెంట్లు – 7,725
➤ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు – 1,781
➤పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు – 286
➤ప్రిన్సిపల్ పోస్టులు – 52
➤ పీఈటీ టీచర్లు – 132
TTD SVIMS Recruitment 2025 | TTDలో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ | కొద్ది గంటలే గడువు
జిల్లాల వారీగా పోస్టులు :
➧శ్రీకాకుశం – 543
➧విజయనగరం – 583
➧విశాఖపట్నం -1,134
➧తూర్పుగోదావరి – 1,346
➧పశ్చిమ గోదావరి – 1,067
➧క్రిష్ణ – 1,213
➧గుంటూరు – 1,159
➧ప్రకాశం – 672
➧నెల్లూరు – 673
➧చిత్తూరు – 1,478
➧కడప – 709
➧అనంతపురం – 811
➧కర్నూలు – 2,678
డీఎస్సీ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఏపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే చేశారు. కానీ పలు కారణాలతో ఈ నోటిఫికేషన్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు మెగా డీఎస్సీపై ప్రకటన వచ్చింది. దీంతో నిరుద్యోగులు వెంటనే తమ ప్రిపరేషన్ మొదలుపెట్టండి.
1 thought on “AP DSC Notification 2025 | ఏపీ డీఎస్సీపై బిగ్ అప్ డేట్ |16,347 పోస్టులకు మార్చిలో నోటిఫికేషన్”