AP Govt jobs 2025 | మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం జిల్లా మహిళా శిశు సంక్షేమ కార్యాలయంలో ఖాళీగా ఉన్న డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 6వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కొరకు నోటిఫికేషన్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు :

ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరంలోని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ లో ఖాళీగా ఉన్న డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ – 01 పోస్టుకు నోటిఫికేషన్ విడదల చేశారు.

అర్హతలు :

డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు చైల్డ్ సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్, హ్యూమన్ రైట్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి ఉండాలి. సంబంధిత విభాగాల్లో 03 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

CBI Credit Officer Recruitment 2025 | CBI లో 1000 ఉద్యోగాలు | నెలకు రూ.50,000 జీతం

Supreme Court Law Clerk Recruitment 2025 | సుప్రీం కోర్టులో లా క్లర్క్ ఉద్యోగాలు | నెలకు రూ.80,000 జీతం

వయస్సు :

డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులకు 24 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 3 ఏళ్లు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం :

డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలను మెరిట్, ఎక్స్ పీరియన్స్, అర్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు. సర్టిఫికెట్ల పరిశీలన చేసి జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో పోస్టింగ్ ఇస్తారు.

జీతం ఎంత :

డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గా ఎంపికైన వారికి నెలకు రూ.44,000 జీతం ఇస్తారు. ఇతర అలవెన్సులు, బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

దరఖాస్తు విధానం :

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగానికి అన్న జాల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసిన దరఖాస్తును పూర్తి చేసి, అన్ని రకాల ధ్రువీకరణ పత్రాల జిరాక్సులు జత చేసి ఫిబ్రవరి 6వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు కార్యాలయంలో సమర్పించాలి.

దరఖాస్తులకు చివరి తేదీ : 06.02.2025

Notification & Application : CLICK HERE

Leave a Comment