AP Health Department Outsourcing Jobs 2025 | ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ జాబ్స్

AP Health Department Outsourcing Jobs 2025 ఏపీ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డపార్ట్మెంట్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 31 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

AP Health Department Outsourcing Jobs 2025

పోస్టుల వివరాలు: 

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆరోగ్య సంస్థలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 31 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పోస్టు పేరుఖాళీలు
బయో మెడికల్ ఇంజనీర్(కాంట్రాక్ట్)01
ఆడియో మెట్రిక్ టెక్నీషియన్(కాంట్రాక్ట్)05
రేడియో గ్రాఫర్ (కాంట్రాక్ట్)03
ల్యాబ్ టెక్నీషియన్ (కాంట్రాక్ట్)01
థియేటర్ అసిస్టెంట్ (అవుట్ సోర్సింగ్)04
ఆఫీస్ సబార్డినేట్ (అవుట్ సోర్సింగ్)01
జనరల్ డ్యూటీ అటెండెంట్ (అవుట్ సోర్సింగ్)11
ప్లంబర్ (అవుట్ సోర్సింగ్)02
పోస్ట్ మార్టం అసిస్టెంట్ (అవుట్ సోర్సింగ్)03

అర్హతలు: 

AP Health Department Outsourcing Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. 

  • బయో మెడికల్ ఇంజనీర్ : BE / B.Tech / ME / M.Tech (బయో మెడికల్ ఇంజనీరింగ్)
  • ఆడియో మెట్రిక్ టెక్నీషియన్ : ఆడియాలజీలో డిగ్రీ లేదా డిప్లొమా
  • రేడియోగ్రాఫర్ : CRA / DRGA / DMIT సర్టిఫికెట్, APPMB రిజిస్ట్రేషన్
  • ల్యాబ్ టెక్నీషియన్ : DMLT / BSc(MLT), APPMB రిజిస్ట్రేషన్
  • థియేటర్ అసిస్టెంట్ : 10వ తరగతి మరియు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్
  • ఆఫీస్ సబార్డినేట్ : 10వ తరగతి
  • జనరల్ డ్యూటీ అటెండెంట్ : 10వ తరగతి
  • ప్లంబర్: 10వ తరగతి మరియు ఐటిఐ
  • పోస్ట్ మార్టం అసిస్టెంట్ : 10వ తరగతి

వయస్సు: 

AP Health Department Outsourcing Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచ 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు: 

AP Health Department Outsourcing Jobs 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ.500/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఫీజు లేదు. అప్లికేషన్ ఫీజును ఆఫ్ లైన్ విధానంలో చెల్లించాలి. డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, వెస్ట్ గోదావరి పేరుపై డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి.

ఎంపిక ప్రక్రియ : 

AP Health Department Outsourcing Jobs 2025 పోస్టులకు విద్యార్హతలు, అనుభవం, సర్వీస్ వెయిటేజీ ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు వెయిటేజీ నిర్ణయించారు. 

  • విద్యార్హతల్లో వచ్చిన మార్కులు – 75 మార్కులు
  • అర్హత సాధించిన తర్వాత పూర్తయిన సంవత్సరాలకు – 10 మార్కులు
  • అనుభవం – 15 మార్కులు

జీతం : 

AP Health Department Outsourcing Jobs 2025 ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టును బట్టి జీతం ఉంటుంది. 

కాంట్రాక్ట్ పోస్టులు: 

  • బయో మెడికల్ ఇంజనీర్ – రూ.54,060/-
  • ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ – రూ.32,670/-
  • రేడియోగ్రాఫర్ – రూ.35,670/-
  • ల్యాబ్ టెక్నీషియన్ – రూ.32,670

అవుట్ సోర్సింగ్ పోస్టులు : 

థియేటర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ప్లంబర్, పోస్ట్ మార్టం అసిస్టెంట్ పోస్టులకు రూ.15,000/- జీతం ఇస్తారు. 

దరఖాస్తు విధానం: 

AP Health Department Outsourcing Jobs 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో వివరాలను నింపి, అవసరమైన డాక్యుమెంట్లు జత చేయాలి. జనరల్ అభ్యర్థులు రూ.500/- డిమాండ్ డ్రాఫ్ట్ జత చేయాలి. అప్లికేషన్ ని ఏప్రిల్ 19వ తేదీ లోపు ఏలూరులోని DCHS కార్యాలయంలో సమర్పించాలి. 

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తు ప్రారంభ తేేదీ09 – 04 – 2025
దరఖాస్తులకు చివరి తేదీ19 – 04 – 2025
NotificationCLICK HERE
Official WebsiteCLICK HERE

Leave a Comment