AP Inter Results 2025 | How to Check AP Inter Results 2025 in Whatsapp | AP Inter 1st Year Results 2025 | AP Inter 2nd Year Results 2025

AP Inter Results 2025 ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. విద్యార్థులు ఇప్పుడు ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారులు ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం చేస్తున్నారు. ఏపీ ఇంటర్ పరీక్షల మూల్యాంకనం నేటితో పూర్తి కానుంది.

AP Inter Results 2025 : ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగాయి. ప్రస్తుతం ఇంటర్ పరీక్షల మూల్యాంకనం వేగంగా జరుగుతోంది. నేటితో ఈ మూల్యాంకనం పూర్తవుతుంది. మూల్యాంకనం పూర్తి అయిన తర్వాత ఫలితాలను కంప్యూటరీకరణ చేయాల్సి ఉంటుంది. ఈ కంప్యూటరీకరణ కోసం ఒక వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. కంప్యూటరీకరణ తర్వాత అధికారులు పరిశీలించి ఫలితాలను విడుదల చేస్తారు.

AP Inter Results 2025 Release Date: 

ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇంటర్ బోర్డు కూడా సాధ్యమైనంత త్వరగా ఫలితాలను ప్రకటించాలని చూస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 12 లేదా 13వ తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ తేదీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. 

AP Inter Results Checked Via Whatsapp: 

AP Inter Results 2025: ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ ఫలితాలు చూసుకునేందుకు చాలా సులభతరం చేేసింది. గతంలో ఇంటర్ పరీక్షల ఫలితాల తెలుసుకునేందుకు ఇంటర్నెట్ కేంద్రాలను సందర్శించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా డైరెక్టుగా మీ మొబైల్ వాట్సాప్ కే ఫలితాలు వచ్చే విధంగా ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ ను తీసుకొచ్చింది. విద్యార్థుల మార్కలను పీడీఎఫ్ రూపంలో తయారు చేసి వాట్సాప్ ద్వారా పంపిస్తారు. ఈ షార్ట్ పీడీఎఫ్ మార్కు మెమోలను విద్యార్థులుు ప్రవేశ పరీక్షల కోసం ఉపయోగించుకోవచ్చు. 

రెండు పద్ధతుల్లో ఫలితాలు :

AP Inter Results 2025: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను రెండు పద్ధతుల్లో చూసుకోవచ్చు. ఏపీ అధికారిక వెబ్ సైట్  లేదా వాట్సాప్ నెంబర్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. 9552300009 వాట్సాప్ నెంబర్ ద్వారా లేదా అధికారిక వెబ్ సైట్ Bse.Ap ఫలితాలను చేసుకోవచ్చు. 

How to Check Inter Results in Whatsapp: 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు అవసరమైన వివిధ పౌర సేవలను సులభవంగా మరియు సమర్థవంతంగా అందించేందుకు మన మిత్ర(వాట్సాప గవర్నెన్స్) ని తీసుకొచ్చింది. ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా విద్యార్థులు కూడా తమ సేవలను ఉపయోగించుకోవచ్చు. పదో తరగతి, ఇంటర్ ఫలితాలను వాట్సాప్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. 

అంతేకాదు గతంలో ఇంటర్ మెమోల కోసం చాలా రోజులు ఎదురుచూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆసమస్య ఉండదు. ఎందుకంటే మనమిత్ర వాట్సాప్ ద్వారా షార్ట్ మెమోలు పొందవచ్చు. దీంతో షార్ట్ మెమోలను క్షణాల్లో డౌన్ లోడ్ చేసుకునే విద్యార్థులు తమ వద్ద ఉంచుకోవచ్చు.

Inter Results Checking process in Whatsapp: 

  • మొదటగా 9552300009 అనే నెంబర్ ను మన సేవ్ చేసుకోవాలి. 
  • వాట్సాప్ లో ఈ నెంబర్ కు హాయ్ అనే మెసేజ్ పంపాలి.
  • వాట్సాప్ లో వివిధ రకాల సేవలు ఉంటాయి. విద్యాసేవలు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి 
  • అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. 
  • ఫలితాలను PDF రూపంలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ పీడీఎఫ్ లు షార్ట్ మెమోలుగా ఉపయోగపడతాయి. 

Leave a Comment