ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 13వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 4 జిల్లాల్లో ఈ జాబ్ మేళా జరుగుతుంది. నంద్యాల జిల్లా, పల్నాడు జిల్లా, కర్నూలు జిల్లా, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి. ఎలాంటి పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాలు:
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళా మార్చి 13వ తేదీన రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో జరుగుతుంది. ఈ జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీలు, పోస్టుల వివరాలను కింద ఇచ్చిన అధికారిక వెబ్ సైట్ లింక్ పై క్లిక్ చేసి చూడొచ్చు.
అర్హతలు :
AP Job Mela లో పాల్గొనే అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, పీజీ చేసిన వారు హాజరుకావచ్చు.
వయస్సు:
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థులకు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఇవి ప్రైవేబ్ ఉద్యోగాలు కాబట్టి రిజర్వేషన్లు వర్తించవు.
ఎంపిక ప్రక్రియ:
AP Job Mela లో ఉద్యోగాల కోసం అభ్యర్థులను ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరచిన వారికి ఉద్యోగం అయితే ఇస్తారు.
జీతం :
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు మంచి ప్యాకేజీతో జీతాలు ఉంటాయి. రూ.15,000/- నుంచి రూ.45,000/- వరకు జీతాలు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళాలో దరఖాస్తు చేసుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్ వెబ్ సైట్ లో వెళ్లి అప్లయ్ చేేసుకోవాలి. అప్లయ్ లింక్ కింద ఇవ్వబడ్డాయి. అభ్యర్థులు ఆ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
కావాల్సిన డాక్యుమెంట్స్:
జాబ్ మేళాలో ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట కింది డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి. అభ్యర్థులు ఒరిజనల్ డాక్యుమెంట్స్ తో హాజరుకావాలి.
- బయోడేటా
- ఆధార్ కార్డు
- విద్యార్హత సర్టిఫికెట్లు
ఇంటర్వ్యూ జరిగే వేదికలు :
● నంద్యాల జిల్లా : SVB గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, కోవెలకుంట్ల
● పల్నాడు జిల్లా : SKBR గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, సాగర్ రోడ్, మాచర్ల
● కర్నూలు జిల్లా : ఉస్మానియా కాలేజీ, కర్నూలు
● కోనసీమ జిల్లా : డిస్ట్రిక్ ఎంప్లాయ్మెంట్ ఎక్ఛేంజ్ ఆఫీస్, అమలాపురం
ఇంటర్వ్యూ తేదీ : 13 – 03- 2025
Notification | CLICK HERE |
Official Website | CLICK HERE |