AP Jobs Notification | 10వ తరగతి అర్హతతో ఏపీ అవుట్ సోర్సింగ్ జాబ్స్

 AP Jobs Notification ఆంధ్రప్రదేశ్ లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా పలాసలోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వివిధ విభాగాల్లో పోస్టుల నియామకాలు చేపడుతున్నారు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవడానికి ఏప్రిల్ 6వ తేదీన చివరి గడువుగా నిర్ణయించారు. అర్హత ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు. 

పోస్టుల వివరాలు: 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా పలాసలోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మరియు సూపర్ స్పెషాలిటీ  హాస్పిటల్ లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పోస్టు పేరు ఖాళీలు
రిసెప్షన్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్01
డయాలసిస్ టెక్నీషియన్06
సి ఆర్మ్ టెక్నీషియన్02
జనరల్ డ్యూటీ అటెండెంట్స్03
సెక్యూరిటీ గార్డ్01
మొత్తం పోస్టులు 13

అర్హతలు: 

ఏపీలోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో వివిధ రకాల ఉద్యోగాల కోసం కింద అర్హతలు ఉండాలి. 

పోస్టు పేరుఅర్హతలు
రిసెప్షన్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్ఏదైనా డిగ్రీ మరియు కంప్యూటర్ నాలెడ్జ్
డయాలసిస్ టెక్నీషియన్డయాలసిస్ టెక్నీషియన్ కోర్సులో డిప్లొమా, ఏపీపీఎంబీ / ఏపీఏహెచ్సీపీ కౌన్సిల్ నమోదు చేసుకోవాలి. 
సి ఆర్మ్ టెక్నీషియన్గుర్తింపు పొందిన సంస్థ నుంచి డీఎంఐటి కోర్సు చేసి ఉండాలి.
జనరల్ డ్యూటీ అటెండెంట్స్10వ తరగతి
సెక్యూరిటీ గార్డు10వ తరగతి

వయస్సు: 

అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబడ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు: 

పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మరియు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే జనరల్ / బిసి అభ్యర్థులు రూ.550/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. అప్లికేషన్ ఫీజ ఆఫ్ లైన్ లో చెల్లించాలి. 

ఎంపిక ప్రక్రియ: 

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష ఉండదు. అభ్యర్థుల విద్యార్హతల్లో వచ్చిన మార్కుల మెరిట్, గతంలో పనిచేేసిన అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. 

జీతం : 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేేస్తున్న ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతాలు చెల్లించడం జరుగుతుంది. 

పోస్టు పేరు జీతం
రిసెప్షన్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్ రూ.18,500/-
డయాలసిస్ టెక్నీషియన్రూ.32,670/-
సి ఆర్మ్ టెక్నీసియన్రూ.32,670/-
జనరల్ డ్యూటీ అటెండెంట్ రూ.15,000/-
సెక్యూరిటీ గార్డ్రూ.15,000/-

దరఖాస్తు విధానం: 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు చేేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లో ఇచ్చిన అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకుని, ఫారమ్ పూర్తి చేయాలి. పూర్తి చేసిన ఫారమ్ ని అవసరమైన పత్రాలు, ఫీజు చెల్లించిన చలాన్ జత చేసి కింద ఇచ్చిన అడ్రస్ కి రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్వయంగా పంపించాలి. 

దరఖాస్తు పంపాల్సిన అడ్రస్:  

అదనపు డైరెక్టర్, సూపరింటెండెంట్ కార్యాలయం, కిడ్నీ పరిశోధనా కేంద్రం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పలాస.

ముఖ్యమైన తేేదీలు: 

దరఖాస్తు ప్రారంభ తేదీ22 – 03 – 2025
దరఖాస్తులకు చివరి తేదీ06 – 04 – 2025
సెలక్షన్ లిస్ట్ విడుదల29 – 04 – 2025
కౌన్సిలింగ్ నిర్వహించే తేదీ30 – 04 – 2025
జాయింగ్ తేదీ30 – 04 – 2025
NotificationCLICK HERE
Application DownloadCLICK HERE
Official WebsiteCLICK HERE

Leave a Comment