కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసిన చాలామంది అభ్యర్థులు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు .కానీ కానిస్టేబుల్ ఈవెంట్స్ కి వెళ్ళిన తర్వాత వయస్సు విషయంలో చాలామందిని రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చాలామందికి అర్థం కాని విషయం ,చాలామంది కన్ఫ్యూజ్ అవుతుందా విషయాలు చాలా ఉన్నాయి వాటిని అన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా ఈవెంట్స్ కి వెళ్ళిన వారు ఒక పర్టికులర్ డేట్ కి పుట్టాము అని రిజెక్ట్ చేయడం జరిగిందని చెప్తున్నారు.. ఇంకొంతమంది మేము ఈ తారీఖున జన్మించాము మేము క్వాలిఫై అవుతామా లేదా అని చాలా సందేహాలు అయితే పడుతున్నారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
We need to know what age limit is given in AP constable notification:
అయితే ముందుగా ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో వయస్సు పరిమితి ఎంత ఇచ్చారు అనేది మనం తెలుసుకోవాలి. నోటిఫికేషన్లో చెప్పిన దాని ప్రకారంగా ఏపీ కానిస్టేబుల్ కి అర్హత పొందాలంటే 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. కాకపోతే వీళ్ళు చెప్పిందేంటంటే 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలు అనేది జూలై ఒకటవ తారీఖున 2022 వ సంవత్సరం నిండి ఉండాలి. అంటే ఈ సంవత్సరం లోపు మనకు 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వయసు ఉండాలి అన్నమాట. అంటే ఇంకొక విషయం జూలై ఒకటవ తారీకు 2022 ఈ ఈ తారీకు మనకు 24 సంవత్సరాలు దాటకూడదు అని అర్థం .అంటే వయస్సు 24 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. 24 సంవత్సరాల వయస్సుకి దాటి ఉండకూడదు.
ఆ తర్వాత నోటిఫికేషన్ లో ఏమని పొందుపరిచారు అంటే “2nd july 1998 ” కన్నా ముందు జన్మించి ఉండకూడదు అన్న విషయం కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. అలాగే 1st July 2004 కన్నా తర్వాత జన్మించి ఉండకూడదు అన్న ఒక కండిషను ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ పాయింట్ వచ్చేసరికి ఇది కాదు చాలామంది పుట్టి ఉంటారు. ఉదాహరణకి కొంతమంది 1991లో పుట్టి ఉంటారు 1992లో పుట్టి ఉంటారు 1993, 94 ఇలా కొన్ని సంవత్సరాలలో వాళ్లు జన్మించి ఉంటారు. అయితే వీళ్ళకి ఒక చిన్నపాటి భయం అయితే ఉంటుంది. అంటే వెళ్లిన తర్వాత మనల్ని యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే ఈవెంట్స్ లో రిజెక్ట్ చేస్తారని ఇలాంటి సందేహాలు చాలా అయితే ఉన్నాయి.
అయితే ఇక్కడ మీరు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన వయస్సు పరిమితి ప్రతి ఒక్కరికి తెలుసు 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల లోపు ఉన్న ఎవరైనా సరే కానిస్టేబుల్ ఉద్యోగానికి అర్హులు అని ఇవ్వడం జరిగింది.. అయితే ఆంధ్రప్రదేశ్ లో చాలా సంవత్సరాల నుంచి కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రాకపోవడం వల్ల దీనికి అదనముగా రెండు సంవత్సరాలు పెంచడం జరిగింది. ఇలా రెండు సంవత్సరాలు మనకి ఎక్కువగా ఇవ్వడం వలన ఇక్కడ ముఖ్యంగా 18 నుంచి 24 సంవత్సరాల వయసు ఉండాలి అంటే జూలై 2nd 1998 కంటే ముందు పుట్టి ఉండకూడదు అంటే జన్మించి ఉండకూడదు. అంటే ఇలా రెండు సంవత్సరాలు పెంచడం వల్ల ఏమవుతుంది అంటే నోటిఫికేషన్లో 1998 కాస్త 1996కు మారుతుంది అన్నమాట. 2nd జూలై 1996 కంటే ముందు జన్మించి ఉండకూడదు అది కూడా OC అంటే జనరల్ కేటగిరి కి సంబంధించిన వాళ్ల కోసం. అంటే OBC, SC, ST వాళ్లు కాకుండా ఎవరైతే జనరల్ కేటగిరి కి సంబంధించిన వాళ్ళు ఉంటారు వాళ్లు 1996 కంటే ముందు జన్మించి ఉండకూడదు. అలా అప్లై చేసుకుంటే ఈ జనరల్ క్యాటగిరి వాళ్లు రిజెక్ట్ చేయబడతారు. ఇది మీరు కచ్చితంగా గమనించాల్సిన విషయం.
మరైతే OBC , SC, ST అభ్యర్థులకు అప్పర్ లిమిట్ 5 సంవత్సరాలు. ఇలా ఐదు సంవత్సరాలు కాబట్టి ఈ అభ్యర్థులకు 2nd జూలై 1991. అంటే ఎవరైతే OBC క్యాండిడేట్స్ కానీ, SC క్యాండిడేట్స్ కానీ , ST డీటెయిల్స్ కానీ ఎవరైతే ఈ ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేసి ఉంటారో. వీళ్ళు 2nd July 1991 కన్నా ముందు జన్మించి ఉంటారు . వాళ్లందర్నీ కూడా ఏపీ కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్ లో రిజెక్ట్ చేయబడతారు.
ఇలా చాలామంది అభ్యర్థులకు తెలియటం లేదు ఎందుకు వాళ్ళని ఈవెంట్స్ లో రిజెక్ట్ చేస్తున్నారు అని. ఇలా చాలామంది 1992 , 93 పుట్టిన సంవత్సరాలు ఉన్నవారు ఈవెంట్స్ కి వెళ్లడానికి ఒక సందేహంతో భయపడుతున్నారు వాళ్ళని ఎక్కడ రిజెక్ట్ చేస్తారు అని.
అంటే ఇక్కడ ఒకటే విషయం మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఎవరైతే SC, ST, OBC వాళ్లు ఉన్నారో 2nd July 1991 కంటే ముందు జన్మించి ఉంటే మాత్రం ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగానికి అనర్హులు. మీరు ఒకవేళ 3rd July 1991 కి జన్మించి ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. అలా కాకుండా ఒక్కరోజు ముందు అంటే 1st July 1991 కి జన్మించిన కూడా మీరు ఈవెంట్స్ లో రిజెక్ట్ అవ్వబడతారు. మీరు 1992లో కానీ 93లో కానీ 94 లో కానీ జన్మించి ఉంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఈవెంట్స్ లో ఎలిజిబుల్ అవుతారు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు.
ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది Cut Off date అంటే 2nd July 1991 తర్వాత నుంచి మీరు 1992, 1993, ఏ సంవత్సరం జన్మించిన మీరు అర్హులవుతారు .ఒకవేళ 1st july 1991 జన్మించిన లేదా ఏప్రిల్ 1991 లో జన్మించిన. వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ కారు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకుని ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణులై ఈవెంట్స్ కి వెళ్లి రిజెక్ట్ అవుతామా అని కన్ఫ్యూజ్ అవుతున్న ప్రతి ఒక్కరికి వాళ్ల వయసు విషయంలో పూర్తిగా సమాచారం ఈ ఆర్టికల్ లో పొందుపరచడం జరిగింది .ఒకవేళ మీకు తెలిసిన సోదరులలో ఎవరైనా ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాలకి అప్లై చేసుకుని ఇలా భయపడుతూ ఉంటే వాళ్లకి కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి.