AP RWSS Recruitment 2025 | ఏపీ రూరల్ వాటర్ సప్లయ్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ లో జాబ్స్

AP RWSS Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ రూరల్ వాటర్ సప్లయ్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కన్సల్టెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. ఈ నియామకాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన 11 నెలల పాటు పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పొడిగిస్తారు. 

AP RWSS Recruitment 2025

పోస్టుల వివరాలు : 

ఈ నోటిఫికేషన్ ఏపీలోని క్రిష్ణా జిల్లా నుంచి విడుదలైంది. జిల్లా రూరల్ వాటర్ సప్లయ్ ఇంజనీరింగ్ అధికారి నుంచి ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. క్రిష్ణా జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

పోస్టు పేరుఖాళీలు
మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కన్సల్టెంట్01
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్01
లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్01

అర్హతలు : 

  • మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కన్సల్టెంట్ : కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ పాసై ఉండాలి. దీంతో పాటు కంప్యూటర్ రంగంలో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. 
  • సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ : సైన్స్ / సోషల్ సైన్స్ విభాగంలో డిగ్రీ పాసై ఉండాలి. దీంతో పాటు 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
  • లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ : సైన్స్ / సోషల్ సైన్స్ విభాగంలో డిగ్రీ పాసై ఉండాలి. దీంతో పాటు 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. 

వయస్సు : 

AP RWSS Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ : 

AP RWSS Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను విద్యార్హతల్లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను జాబ్స్ కి ఎంపిక చేస్తారు. 

జీతం : 

AP RWSS Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు  నెలకు రూ.20,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం : 

AP RWSS Recruitment 2025 పోస్టులకు క్రిష్ణా జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ లో ఇచ్చిన అప్లికేషన్ తో పాటు అర్హత మరియు అనుభవంతో వారి రెజ్యూమ్ ని కింద ఇచ్చిన అడ్రస్ కి నేరుగా లేదా పోస్ట్ ద్వారా సమర్పించాలి. దరఖాస్తులను ఏప్రిల్ 30వ తేదీ లోపు పంపాలి. 

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: 

జిల్లా RWS ఇంజనీరింగ్ అధికారి, RWS&S శాఖ, నోబుల్ కాలేజీ(పీజీ) ఎదురుగా, రామానాయుడు పేట, మచిలీపట్నం – 521001

  • దరఖాస్తులకు చివరి తేదీ : 30 – 04 – 2025

Leave a Comment