AP TMC Jobs 2025 : ఏపీలో టాటా మెమోరియల్ సెంటర్ నుంచి జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 34 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు పదో తరగతి నుంచి డిగ్రీ చదివిన వారు అప్లయి చేసుకోవచ్చు. 18-50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.. మరీ ఈ నోటిఫికేషన్ లో ఇచ్చిన ఉద్యోగాలు, వాటి అర్హతలు తదితర వివరాలను తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు, వయస్సు మరియు అర్హతలు :
AP TMC Recruitment 2025 ద్వారా మెడికల్, నాన్ మెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 34 పోస్టులు ఉన్నాయి.
మెడికల్ ఆఫీసర్ : మెడికల్ ఆఫీసర్ పోస్టులు 9 ఉన్నాయి. 50 సంవత్సరాల లోపు వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. MD/DM/DNB అర్హతలు ఉన్న వారు అప్లయి చేసుకోవచ్చ.
అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ : అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ పోస్టులు 01 ఉన్నాయి. ఈ పోస్టులకు 18-40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. MBBS/BDS/MD/DNB/MHA/MBA అర్హతలు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వైద్య భౌతిక శాస్త్రవేత్త : వైద్య భౌతిక శాస్త్రవేత్త పోస్టు 01 ఉంది. 18-35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. MSC Physics మరియు డిప్లొమా ఉన్న వారు అర్హులు.
LIC Recruitment 2025 | LIC కెరీర్ ఏజెంట్ జాబ్స్
అధికారి ఇన్ ఛార్జ్ : అధికారి ఇన్ ఛార్జ్ పోస్టు 01 ఉంది. 18-40 సంవత్సరాల మధ్య వయస్సు వారు అర్హులు. ఫార్మసీలో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి.
సైంటిఫిక్ అసిస్టెంట్ : సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు 02 ఉన్నాయి. 18-35 సంవత్సరాల మధ్య వయస్సు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమాతో బీఎస్సీ లేదా ఎంఎస్సీ లేదా పీజీ చేసి ఉండాలి.
క్లినికల్ సైకాలజిస్ట్ : క్లినికల్ సైకాలిజిస్ట్ పోస్టు 01 ఉంది. 18-30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎంఏ(క్లినికల్ సైకాలజీ) చేసిన వారు అర్హులు.
టెక్నీషియన్ : టెక్నీషియన్ పోస్టు 01 ఉంది. 18-30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఇంటర్ లేదా డిప్లొమా చేసిన వారు అర్హులు.
నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్1 : 01 పోస్టులు. 18-45 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంఎస్సీ(నర్సింగ్) చేసిన వారు అర్హులు.
మహిళా నర్సు : 02 పోస్టులు. 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. జీఎన్ఎమ్ లేదా బీఎస్సీ నర్సింగ్ లేదా డిప్లొమా ఇన్ అంకాలజీ నర్సింగ్ అర్హతలు ఉండాలి.
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ||| : 01 పోస్టులు. 18-55 ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీ లేదా పీజీ లేదా పీజీ డిప్లొమా చేసి ఉండాలి.
అకౌంట్ ఆఫీసర్ || : 01 పోస్టులు. 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. సీఏ లేదా ఐసీడబ్ల్యూఏ చేసి ఉండాలి.
అసిస్టెంట్ : 01 పోస్టులు. 18-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఏదైనా డిగ్రీ కలిగిన వారు అర్హులు.
లోయర్ డివిజన్ క్లర్క్ : 01 పోస్టులు. 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఏదైనా డిగ్రీ ఉండాలి.
పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ : 01 పోస్టులు. 18-50 ఏళ్ల మధ్య ఉండాలి. ఏదైన యూనివర్సిటీ పబ్లిక్ రిలేషన్స్ లేదా జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ లో మాస్టర్ డిగ్రీ.
అటెండెంట్ : 05 పోస్టులు ఉన్నాయి. 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. పదో తరగతి పాసై ఉండాలి.
ట్రేడ్ హెల్పర్ : 05 పోస్టులు. 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. పదో తరగతి పాసై ఉండాలి.
ముఖ్యమైన తేదీలు : AP TMC Recruitment 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ : 10-01-2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 10-02-2025
దరఖాస్తు ఫీజు :
AP TMC Recruitment 2025 ఉద్యోగాలకు అప్లయ్ చేసే జనరల్ అభ్యర్థులకు రూ.300 ఫీజు నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికాలంగు, ఎక్స్ సర్వీస్ మెన్ లకు ఫీజు లేదు. ఆన్ లైన్ లో ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం :
AP TMC Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారికి రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం :
AP TMC Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టును బట్టీ రూ.25,000 నుంచి రూ.60,000 వరకు జీతం ఉంటుంది.
Notification : CLICK HERE
Medical Post Apply Online : CLICK HERE
Non Medical Post Apply Online : CLICK HERE