AP WDCD Notification 2025 | ఏపీలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు

AP WDCD Notification 2025 ఏపీలోని ఉమెన్ డెవలప్మెంట్ మరియు ఛైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ తిరుపతి జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ నుంచి విడుదలైంది. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు తిరుపతిలోని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, స్పెషలిస్ట్ అడాప్షన్ ఏజెన్సీ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో పనిచేయాల్సి ఉంటుంది. 

 AP WDCD Notification 2025

పోస్టుల వివరాలు : 

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఏపీలోని తిరుపతి జిల్లా ఉమెన్ డెవలప్మెంట్ మరియు ఛైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైంది. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పోస్టు పేరుఖాళీల సంఖ్య
కౌన్సిలర్ (మహిళ)01
సోషల్ వర్కర్ (పురుషుడు)01
డేటా అనలిస్ట్01
ఔట్ రీచ్ వర్కర్01
పార్ట్ టైమ్ డాక్టర్01
ఎర్టీ చైల్డ్ వుడ్ సోషల్ వర్కర్(మహిళ)01
ఆయా(మహిళ)04
చౌకీదార్ (మహిళ)01
అసిస్టెంట్ కమ్ డీఈఓ01

అర్హతలు : 

AP WDCD Notification 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. 

పోస్టు పేరుఅర్హతలు
కౌన్సిలర్ సోషల్ వర్క్ / సోషియాలజీ / సైకాలజీ / పబ్లిక్ హెల్త్ / కౌన్సెలింగ్ విభాగంలో డిగ్రీ లేదా కౌన్సెలింగ్ మరియు కమ్యూనికేషన్ లో పీజీ చేసి ఉండాలి. దీంతో పాటు ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
సోషల్ వర్కర్సోషల్ వర్క్ / సోషియాలజీ / సోషల్ సైన్సెస్ లో డిగ్రీ చేసి ఉండాలి. అనుభవం ఉన్న వారికి ప్రాధానత్య ఇస్తారు.
డేటా అనలిస్ట్స్టాటిస్టిక్స్ / మ్యాథెమాటిక్స్ / ఎకనామిక్స్ విభాగంలో డిగ్రీ చేసి ఉండాలి. 
ఔట్ రీచ్ వర్కర్12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఉండాలి. 
పార్ట్ టైమ్ డాక్టర్MBBSతో పాటు పీడియాట్రిక్స్ మెడిసిన్ లో స్పెషలైజేషన్ ఉండాలి.
ఎర్లీ కమ్ చైల్డ్ వుడ్ సోషల్ వర్కర్సోషల్ వర్క్ లో పీజీ లేదా డిగ్రీ లేదా సైకాలజీ / ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ మరియు డెవలప్మెంట్ లో పీజీ డిప్లొమా కలిగి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ మరియు ఎక్స్ పీరియన్స్ ఉండాలి. 
ఆయాశిశువులు మరియు 6 సంవత్సరాల లోపు పిల్లలను చూసుకునే అనుభవం ఉండాలి. 
చౌకీదార్గతంలో ఎలాంటి నైతిక దుర్బలత్వం లేని నిబద్ధత మరియు చురుకైన వ్యక్తిత్వం ఉండాలి. మద్యం తాగడం, గుట్కా నమలడం వంటి దుర అలవాట్లు ఉండకూడదు.
అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్12వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. 

వయస్సు: 

AP WDCD Notification 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: 

AP WDCD Notification 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ.250/-, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.200/- ఫీజు చెల్లించాలి.  ఫీజు ఆఫ్ లైన్ విధానంలో చెల్లించాలి. డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, తిరుపతి పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. 

ఎంపిక విధానం: 

AP WDCD Notification 2025 కౌనల్సిలర్, సోషల్ వర్కర్, డేటా అలనిస్ట్, ఎర్టీ చైల్డ్ వుడ్ సోషల్ వర్కర్, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. మిగితా అన్ని పోస్టులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. 

జీతం : 

AP WDCD Notification 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతం ఉంటుంది. 

పోస్టు పేరుజీతం
కౌన్సిలర్, సోషల్ వర్కర్, డేటా అనలిస్ట్, సోషల్ వర్కర్రూ.18,536/-
అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్రూ.13,240/-
ఔట్ రీచ్ వర్కర్రూ.10,592/-
పార్ట్ టైమ్ డాక్టర్రూ.9,930/-
ఆయా, చౌకీదార్రూ.7,944/-

దరఖాస్తు విధానం: 

AP WDCD Notification 2025 పోస్టులకు ఆఫ్ లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ లో పేర్కొన్న ఫార్మట్ లో అప్లికేషన్ ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి. అప్లికేషన్ ని సంబంధిత కార్యాలయానికి పోస్టు ద్వారా లేదా నేరుగా సమర్పించుకోవాలి.  

కావాల్సిన డాక్యుమెంట్స్:

  • 10వ తరగతి సర్టిఫికెట్
  • ఇతర విద్యార్హత సర్టిఫికెట్స్
  • స్టడీ సర్టిఫికెట్ (4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు)
  • క్యాస్ట్ / ఈడబ్ల్యూఎస్ / దివ్యాంగ సర్టిఫికెట్
  • అనుభవం సర్టిఫికెట్
  • ఆధార్ కార్డు

అప్లికేషన్ ఇవ్వాల్సిన అడ్రస్: 

డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, రూమ్ నెంబర్- 506, 5వ ఫ్లోర్, బి-బ్లాక్, కలెక్టరేట్, తిరుపతి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ15 – 04 – 2025
దరఖాస్తులకు చివరి తేదీ30 – 04 – 2025 సాయంత్రం 5.30 వరకు 
NotificationCLICK HERE
Official WebsiteCLICK HERE

Leave a Comment