AP WDCW Recruitment 2025 ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తాత్కాలిక ప్రాతిపాదికన సోషల్ వర్కర్, స్టోర్ కీపర్, అకౌంటెంట్ మరియు ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు. 25 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
AP WDCW Recruitment 2025
పోస్టుల వివరాలు :
ఈ నోటిఫికేషన్ ఏపీలోని ఈస్ట్ గోదావరి జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా స్టోర్ కీపర్, అకౌంటెంట్, సోషల్ వర్కర్, ఆయా, వాచ్ మెన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు:
AP WDCW Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి అర్హతలు వేర్వేరుగా ఉన్నాయి. పోస్టును బట్టి 7వ తరగతి / 10వ తరగతి / డిగ్రీ / పీజీ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు:
AP WDCW Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 25 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
AP WDCW Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అన్ని కేటగిరీల అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అందరూ ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ:
AP WDCW Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేదు. అభ్యర్థులను కేవలం మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం:
AP WDCW Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.7,000/- నుంచి రూ.44,000/- వరకు జీతాలు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
AP WDCW Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జిల్లా వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకుని వివరాలు ఫిల్ చేసి దరఖాస్తు సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ | 09 – 04 – 2025 |
దరఖాస్తులకు చివరి తేదీ | 19 – 04 – 2025 |
Notification | CLICK HERE |