AP Welfare Dept Recruitment 2025 | ఏపీ వెల్ఫేర్ డిపాార్ట్మెంట్ లో ఉద్యోగాలు

AP Welfare Dept Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ నుంచి కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేేశారు. ల్యాబ్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.  18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.  

AP Welfare Dept Recruitment 2025

పోస్టుల వివరాలు : 

ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మొత్తం 30 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. 

మొత్తం పోస్టుల సంఖ్య : 30

పోస్టులుఖాళీలు
డెంటల్ టెక్నీషియన్1
ల్యాబ్ టెక్నీషియన్2
ఎలక్ట్రీషియన్2
కౌన్సెలర్ /MSW Gr -II1
జనరల్ డ్యూటీ అటెండెంట్13
పోస్ట్ మార్టమ్ అసిస్టెంట్3
థియేటర్ అసిస్టెంట్5
ఆఫీస్ సబార్డినేట్3

అర్హతలు : 

AP Welfare Dept Recruitment 2025 ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్మీడియట్ చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు BSC(MLT) లేదా DMLT, కౌన్సెలర్ పోస్టుకు BA(Social Work) చేసిన వారు అప్లయ్ చేసుకోవాలి. కొన్ని పోస్టులకు అనుభవం కూడా అవసరం ఉంటుంది. 

వయస్సు : 

AP Welfare Dept Recruitment 2025 ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు : 

AP Welfare Dept Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ.500/-, BC / SC / ST / EWS అభ్యర్థులు రూ.300/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ ఫీజును UPI Transfer / RTGS / NEFT ద్వారా నోటిఫికేషన్ లో ఇచ్చిన అకౌంట్ నెంబర్ కి ట్రాన్ఫర్ చేయాలి. అప్లికేషన్ సమర్పించే సమయంలో ట్రాన్సాక్షన్ రిసిప్ట్ ని జత చేసి పంపాలి. 

ఎంపిక ప్రక్రియ: 

AP Welfare Dept Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసుకుని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. 

జీతం : 

AP Welfare Dept Recruitment 2025 ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి రూ.15,000/- నుంచి రూ.32,670/- వరకు జీతం చెల్లించడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

AP Welfare Dept Recruitment 2025 ఏపీ వెల్ఫేర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి కింద ఇచ్చిన లింక్స్ ఆధారంగా నోటిఫికేషన్ మరియు అప్లకేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ లో వివరాలు పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ మరియు అప్లికేషన్ ఫీజు చెల్లించిన రషీదు జత చేసి నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కి మార్చి 18వ తేదీ లోపు పోస్టు ద్వారా పంపాలి. 

  • దరఖాస్తులకు చివరి తేదీ : 18 – 03 – 2025
NotificationCLICK HERE
ApplicationCLICK HERE
Official WebsiteCLICK HERE

Leave a Comment