ASRB NET Recruitment 2025 | అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డులో జాబ్స్ 

ASRB NET Recruitment 2025 అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డు(ASRB) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్(ARS),  సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్((SMS), సీనియర్ టెక్నికల్ ఆఫీసర్(STO) పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 582 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 22వ తేదీ నుంచి అప్లికేషన్లు పెట్టుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి మంచి జీతాలు ఇస్తారు. సమయం ఉంది కాబట్టి అర్హత ఉన్న అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెడితే జాబ్ ఈజీగా కొట్టొచ్చు. 

ASRB NET Recruitment 2025

పోస్టుల వివరాలు : 

అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్(ARS),  సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్((SMS)(T-6), సీనియర్ టెక్నికల్ ఆఫీసర్(STO)(T-6) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 

మొత్తం పోస్టుల సంఖ్య : 582

పోస్టు పేరుఖాళీల సంఖ్య
అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్(ARS)458
సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్((SMS)(T-6)41
సీనియర్ టెక్నికల్ ఆఫీసర్(STO)(T-6)83

అర్హతలు : 

ASRB NET Recruitment 2025 అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్(ARS),  సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్((SMS)(T-6), సీనియర్ టెక్నికల్ ఆఫీసర్(STO)(T-6) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. 

పోస్టు పేరుఅర్హతలు
అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్(ARS)సంబంధిత విభాగంలో పీహెచ్డీ
సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్((SMS)(T-6)సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ
సీనియర్ టెక్నికల్ ఆఫీసర్(STO)(T-6)సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ

వయస్సు: 

ASRB NET Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: 

ASRB NET Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు ఫీజు వివరాలు కింద తెలిపిన విధంగా ఉంటాయి. 

కేటగిరీFor NET OnlyFor ARS/SMS(T-6)/STO(T-6) or Any combination of this threeFor NET with any combination of ARS/SMS(T-6)/STO(T-6)
జనరల్ అభ్యర్థులురూ.1000రూ.1000రూ.1000
EWS/OBCరూ.500రూ.800రూ.1300
SC/ST/PwBD/Women/Transgenderరూ.250ఫీజు లేదురూ.250

ఎంపిక ప్రక్రియ:

ASRB NET Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. 

జీతం : 

ASRB NET Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు లెవల్ 10 కింద రూ.56,100/- జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

ASRB NET Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ ప్రక్రియ ఏప్రిల్ 22వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. 

ముఖ్యమైన తేదీలు: 

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం22 – 04 – 2025
దరఖాస్తులకు చివరి తేదీ21 – 05 – 2025
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్2 – 4 సెప్టెంబర్
మెయిన్స్ ఎగ్జామ్7 డిసెంబర్
NotificationCLICK HERE
Official WebsiteCLICK HERE

Leave a Comment