Bank of Maharashtra SO Recruitment 2025 : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిిఫికేషన్ ద్వారా 172 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 29 తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇతర వివరాలను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారిక వెబ్ సైట్ లో ఉన్న నోటిఫికేషన్ లో తెలుసుకోవచ్చు.
Bank of Maharashtra SO Recruitment 2025
పోస్టుల వివరాలు మరియు అర్హతలు :
మొత్తం పోస్టులు – 172
1.జనరల్ మేనేజర్ – డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్
అర్హతలు – B.Tech/BE in CS/IT or MCA
2.డిప్యూటీ జనరల్ మేనేజర్ – ఐటీ ఎంటర్ ప్రైస్ & డేటా ఆర్కిటెక్
అర్హతలు – B.Tech/BE in CS/IT or MCA
3.అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్
అర్హతలు – B.Tech/BE in CS/IT or MCA with CISA/CISM Certification
4.సీనియర్ మేనేజర్ – సైబర్ సెక్యూరిటీ
అర్హతలు – B.Tech/BE in CS/IT or MCA with CISA/CISM Certification
5.మేనేజర్ – నెటవర్క్ మరియు సెక్యూరిటీ
అర్హతలు – B.Tech/BE in CS/IT or MCA
AP Fibernet Limited jobs 2025 | ఏపీ ఫైబర్ నెట్ లో ఉద్యోగాలు | పరీక్ష లేకుండానే సెలెక్షన్
CSIR IIP Recruitment 2025 | ఇంటర్ అర్హతతో జూనియర్ సెక్రటేరియేట్ అసిస్టెంట్ జాబ్స్
వయస్సు :
Bank of Maharashtra SO Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 22 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
Gen/EWS/OBC కేటగిరీ అభ్యర్థులకు రూ.1,180 ఫీజు నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.118 ఫీజు చెల్లించాలి. ఫీజును ఆన్ లైన్ లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసే విధానం :
Bank of Maharashtra SO Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ bankofmaharashtra.in సందర్శించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని పూర్తి చేయాలి. అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి. అనంతరం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ :
Bank of Maharashtra SO Recruitment 2025 ఉద్యోగాలను రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో ఆప్టిట్యూడ్, బ్యాంకింగ్ అవగాహన మరియు సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలతో ఆన్ లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
జీతం :
Bank of Maharashtra SO Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టీ రూ.50,000 నుంచి రూ.1,20,000 వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేదీ : 17 ఫిబ్రవరి 2025
Notification : CLICK HERE
Apply Online : CLICK HERE