BEL Recruitment 2025 | భారత్ ఎలక్ట్రానిక్స్ లో డిప్యూటీ ఇంజనీర్ పోస్టులు

BEL Recruitment 2025 భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి డిప్యూటీ ఇంజనీర్ పోస్టుల నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం యూనిట్ లో మొత్తం 20 డిప్యూటీ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యుత్ రంగంలో కెరీర్ ని రూపొందించుకునే అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

BEL Recruitment 2025

పోస్టుల వివరాలు :  

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మచిలీపట్నం యూనిట్ లో డిప్యూటీ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.

మొత్తం పోస్టుల సంఖ్య : 20

పోస్టు పేరుఖాళీల సంఖ్య
డిప్యూటీ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్)08
డిప్యూటీ ఇంజనీర్ (మెకానికల్)12

అర్హతలు : 

BEL Recruitment 2025 డిప్యూటీ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్ చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టు పేరుఅర్హతలు
డిప్యూటీ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్)ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్ / కమ్యూనికేషన్ / టెలికమ్యూనికేషన్ లో BE / B.Tech / AMIE / GIETE / B.Sc Engineering
డిప్యూటీ ఇంజనీర్ (మెకానికల్)మెకానికల్ లో BE / B.Tech / AMIE / GIETE / BSc Engineering

వయస్సు: 

BEL Recruitment 2025 డిప్యూటీ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ /EWS అభ్యర్థులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు: 

BEL Recruitment 2025 డిప్యూటీ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.472/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు ఫీజు లేదు. అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: 

BEL Recruitment 2025 డిప్యూటీ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం : 

BEL Recruitment 2025 మచిలీపట్నం యూనిట్ లో డిప్యూటీ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.11.67 లక్షల ప్యాకేజీతో జీతం చెల్లిస్తారు. నెలకు రూ.40,000/-  నుంచి రూ.1,40,000/- వరకు జీతం ఉంటుంది. అంటే స్టార్టింగ్ జీతం రూ.97,250/- జీతం ఉంటుంది. 

దరఖాస్తు విధానం : 

BEL Recruitment 2025 మచిలీపట్నం యూనిట్ లో డిప్యూటీ ఇంజనీర్ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లయ్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. 

ముఖ్యమైన తేదీలు: 

ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ07 – 03 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ31 – 03 – 2025
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Leave a Comment