BEL Recruitment 2025: భారత్ ఎలక్రానిక్స్ లిమిటెడ్(BEL) నుంచి ట్రైనీ ఇంజనీర్ మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 137 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఫిబ్రవరి 20వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత ఉన్న వారు పూర్తి నోటిఫికేషన్ చదివి ట్రైనీ ఇంజనీర్ మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
BEL Recruitment 2025
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 137
● ట్రైనీ ఇంజనీర్ – 67
● ప్రాజెక్ట్ ఇంజనీర్ – 70
అర్హతలు :
● ట్రైనీ ఇంజనీర్ : ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు BE / B.Tech / BSc Engineering చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అనుభవం అవసరం లేదు.
● ప్రాజెక్ట్ ఇంజనీర్ : ప్రాజెక్ట ఇంజనీర్ పోస్టులకు BE / B.Tech / BSc Engineering చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయస్సు :
BEL Recruitment 2025 ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు 28 సంవత్సరాలు, ప్రాజెక్టు ఇంజనీర్ పోస్టులకు 32 సంత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
BEL Recruitment 2025 ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.150 ఫీజు చెల్లించాలి. ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ మరియు పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
BEL Recruitment 2025 ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు రాత్ పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.
జీతం :
● ట్రైనీ ఇంజనీర్ : ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు మొదటి సంవత్సరం నెలకు రూ.30,000/-, రెండో సంవత్సరం నెలకు రూ.35,000/-, మూడో సంవత్సరం నెలకు రూ.40,000/- జీతం చెల్లిస్తారు. ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు ఒప్పంద కాలం 2 సంవత్సరాలు ఉంటుంది. పనితీరు ఆధారంగా ఒక సంవత్సరం పొడిగించవచ్చు.
● ప్రాజెక్ట్ ఇంజనీర్ : ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు మొదటి సంవత్సరం నెలకు రూ.40,000/-, రెండో సంవత్సరం నెలకు రూ.45,000/-, మూడో సంవత్సరం నెలకు రూ.50,000/-, 4వ సంవత్సరం రూ.55,000/- జీతం చెల్లిస్తారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు ఒప్పంద కాలం 4 సంవత్సరాలు ఉంటుంది.
దరఖాస్తు విధానం :
BEL Recruitment 2025 పోస్టులకు ఆఫ్ లైన్ పద్ధతిలో దరఖాస్తు చేేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకుని అవసరమైన పత్రాలను జత చేసి డిప్యూటీ జనరల్ మేనేజర్, డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ప్రొఫెసర్ యూఆర్ రావు రోడ్, నాగాలాండ్ సర్కిల్ దగ్గర, జలహళ్లి పోస్టు, బెంగళూరు -560013, కర్ణాటక చిరునామాకు పంపాలి.
దరఖాస్తులకు చివరి తేదీ : 20 – 02 – 2025
Notification : CLICK HERE
Official Website : CLICK HERE
1 thought on “BEL Recruitment 2025 | BEL లో డిగ్రీ అర్హతతో 137 జాబ్స్ | నెలకు రూ.55,000 శాలరీ”