CISF Notification 2025 సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1124 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కానిస్టేబుల్ డ్రైవర్ / కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి CISF Notification విడుదల చేసింది. 03 ఫిబ్రవరి 2025 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. 04 మార్చి 2025 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
CISF Recruitment 2025:
పోస్టుల వివరాలు : మొత్తం పోస్టులు 1124
కానిస్టేబుల్ / డ్రైవర్ పోస్టులు : 845 పోస్టులు
కానిస్టేబుల్ / డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ : 279
అర్హతలు :
-అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి తత్సమాన అర్హత ఉండాలి.
-అభ్యర్థులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
ముఖ్యమైన తేదీలు :
CISF Constable/Driver Notification 2025 ఆన్ లైన్ దరఖాస్తులు 03 ఫిబ్రవరి, 2025న ప్రారంభం అవుతాయి. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 04 ఫిబ్రవరి 2025 గా నిర్ణయించారు.
అప్లికేషన్ ఫీజు:
CISF Recruitment 2025 కానిస్టేబుల్/డ్రైవర్ పోస్టులకు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎమ్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. అప్లికేషన్ ఫీజులను ఆన్ లైన్ లో చెల్లించాలి.
వయో పరిమితి:
CISF Constable/Driver Notification 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేేసే అభ్యర్థుల వయస్సు 04 మార్చి 2025 నాటికి 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
పరీక్ష విధానం :
CISF Constable/Driver Notification 2025 ఉద్యోగాలకు ఆఫ్ లైన్ పద్దతిలో పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. పరీక్షలో 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. 2 గంటల సమయం ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉండదు.
ఎంపిక విధానం:
CISF Constable/Driver Notification 2025 ఎంపిక కోసం ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం శారీరక పరీక్ష నిర్వహిస్తారు.
జీతం :
CISF Constable/Driver Notification 2025 ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.21,000 నుంచి రూ.69,100 జీతం ఉంటుంది.
Hi
I need job
Hii 1need job
I Have 10th clss competition