CSIR ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మినిరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ(IMMT) ఇటీవల జూనియర్ సెక్రటేరియేట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి పర్మనెంట్ జాబ్స్. ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి.. ఖాళీల వివరాలు, అప్లికేషన్ ఫీజు, CSIR IMMT Recruitment 2025 ఎలా దరఖాస్తు చేసుకోవాలి వంటి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
CSIR IMMT Notification 2025 :
పోస్టుల వివరాలు:
-జూనియర్ సక్రటేరియట్ అసిస్టెంట్(జనరల్) – 7 పోస్టులు
-జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(F&A) – 3 పోస్టులు
-జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (S&P) – 3 పోస్టులు
CSIR IMMT Notification 2025 విద్యార్హతలు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీష్ లో టైపింగ్ వేగం 35 wpm మరియు హిందీలో 30 wpm ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
CSIR IMMT Notification 2025 నోటిఫికేషన్ ప్రకారం రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం:
OMR ఆధారిత లేదా కంప్యూటర్ బేస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం రెండు పేర్లు ఉంటాయి. పరీక్ష వచ్చేసి ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లో ప్రశ్నలు అడుగుతారు.
- పేపర్-1 లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు మరియు 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. నెగెటివ్ మార్కింగ్ ఉండదు. 90 నిమిషాల సమయం ఇస్తారు.
-పేపర్-2 లో జనరల్ అవేర్ నెస్ -50 ప్రశ్నలు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్-50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానికి 1 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సమయ వ్యవధి వచ్చే 01 గంట ఇస్తారు.
వయోపరిమితి:
CSIR IMMT Notification 2025 ప్రకారం అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్టంగా 28 సంవత్సరాలు మించకూడదు. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఓబీసీ అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 10 జనవరి 2025
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 08 ఫిబ్రవరి 2025
అప్లికేషన్ ఫీజు:
జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు రూ.500 ఫీజు నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ,పీడబ్ల్యూడీ, మహిళలకు ఫీజు లేదు.
జీతం ఎంత ఉంటుంది:
CSIR IMMT Notification 2025 సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జీతం రూ.19,900 నుంచి రూ.63,200/- ( పే లెవెల్-2) మరియు ఇన్ హ్యాండ్ జీతం సుమారు 35,804 నెలకు వస్తుంది.
ఎలా అప్లయ్ చేయాలి:
CSIR IMMT Notification 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్ కి దరఖాస్తు చేయడానికి కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి అప్లయి చేసుకోండి.
Apply Link : CLICK HERE