CSIR NAL Recruitment 2025 | నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు

CSIR NAL Recruitment 2025 నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (CSIR NAL) టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 36 పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 11వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హలు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. ఎంపికైన వారు బెంగళూరులో ఉన్న కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. 

CSIR NAL Recruitment 2025

పోస్టుల వివరాలు : 

నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మంట్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు.  టెక్నికల్ అసిస్టెంట్ మొత్తం ఖాళీలు 36, బ్యాక్ లాగ్ పోస్టులు 07 ఉన్నాయి. 

పోస్టు పేరు ఖాళీలుపోస్టు పేరుఖాళీలు
టెక్నికల్ అసిస్టెంట్(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్)06టెక్నికల్ అసిస్టెంట్ ( కంప్యూటర్ సైన్స్)07
టెక్నికల్ అసిస్టెంట్(మెకానికల్)16టెక్నికల్ అసిస్టెంట్( కెమికల్)01
టెక్నికల్ అసిస్టెంట్(మల్టీమీడియా అండ్ యానిమేషన్)01టెక్నికల్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్)03
టెక్నికల్ అసిస్టెంట్(సివిల్)02టెక్నికల్ అసిస్టెంట్ (ఫిజిక్స్)01
టెక్నికల్ అసిస్టెంట్(మెటలర్జీ)01టెక్నికల్ అసిస్టెంట్(ఎలక్ట్రికల్)01
టెక్నికల్ అసిస్టెంట్(ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్)02టెక్నికల్ అసిస్టెంట్ (ఇన్ స్ట్రుమెంటేషన్)01

అర్హతలు : 

CSIR NAL Recruitment 2025 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత రంగాల్లో డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. పని అనుభవం కూడా అవసరం. 

వయస్సు : 

CSIR NAL Recruitment 2025 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు : 

CSIR NAL Recruitment 2025 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసే జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు రూ.500/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలు, మాజీ సైనికులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఫీజును ఆన్ లైన్ పద్ధతిలో చెల్లించాలి.

కేటగిరిఅప్లికేషన్ ఫీజు
UR / OBCరూ.500/-
SC / ST / PWBD / Women / Ex Servicemenఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ: 

CSIR NAL Recruitment 2025 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను కింద దశల్లో ఎంపిక చేస్తారు.

  • ట్రేడ్ టెస్ట్
  • రాత పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం : 

CSIR NAL Recruitment 2025 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.35,400/- నుంచి రూ.1,12,400/- వరకు జీతం ఇస్తారు. అంటే అన్ని కలుపుకుని నెలకు రూ.70,000/- జీతం చెల్లిస్తారు. 

దరఖాస్తు విధానం : 

CSIR NAL Recruitment 2025 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లికేషన్ సమర్పించుకోవాలి. ఫొటో గ్రాఫ్, సంతకం, అవసరమైన డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి. అప్లికేన్ ఫీజును చెల్లించాలి. అనంతరం అప్లికేషన్ ఫారమ్ సబ్మిట్ చేయాలి. 

  • ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 11 – 04 – 2025

Notification : CLICK HERE

Apply Online : CLICK HERE

Leave a Comment