DRDO GTRE Apprentice Recruitment 2025 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) – గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్(GTRE) నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 9వ తేదీ నుంచి మే 8వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చదివి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
DRDO GTRE Apprentice Recruitment 2025
పోస్టుల వివరాలు:
గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 150 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు | ఖాళీలు |
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజనీరింగ్) | 75 |
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (నాన్ ఇంజనీరింగ్) | 30 |
డిప్లొమా అప్రెంటిస్ | 20 |
ఐటీఐ అప్రెంటిస్ | 25 |
అర్హతలు:
DRDO GTRE Apprentice Recruitment 2025 పోస్టుల భర్తీకి పోస్టును బట్టి అర్హతలు ఉంటాయి.
పోస్టు పేరు | అర్హతలు |
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజనీరింగ్) | మెకానికల్ / ఏరో / ఎలక్ట్రికల్ / సీఎస్ / మెటలర్జి / సివిల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ |
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్(నాన్ – ఇంజనీరింగ్) | ఏదైనా స్ట్రీమ్ లో బ్యాచిలర్ డిగ్రీ |
డిప్లొమా అప్రెంటిస్ | మెకానికల్ / ఎలక్ట్రికల్ / సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా |
ఐటీఐ అప్రెంటిస్ | మెషినిస్ట్ / ఫిట్టర్ / టర్నర్ / ఎలక్ట్రీషియన్ / వెల్డర్ / షీట్ మెటల్ వర్కర్ / కోపాలో ఐటీఐ సర్టిఫికెట్ |
వయస్సు:
DRDO GTRE Apprentice Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
DRDO GTRE Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అన్ని కేటగిరీల అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
DRDO GTRE Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను అకడమిక్ మార్కల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అప్రెంటిస్ షిప్ ఇస్తారు.
- అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం:
DRDO GTRE Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో స్టయిఫండ్ ఇస్తారు.
పోస్టు పేరు | స్టయిఫండ్ |
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ | రూ.9,000/- |
టెక్నీషియన్ అప్రెంటిస్ | రూ.8,000/- |
ఐటీఐ అప్రెంటిస్ | రూ.7,000/- |
దరఖాస్తు విధానం:
DRDO GTRE Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఆన్ లైన్ లో మే 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ | 09 – 04 – 2025 |
దరఖాస్తులకు చివరి తేదీ | 08 – 05 – 2025 |
షార్ట్ లిస్ట్ అప్ లోడ్ తేదీ | 23 – 05 – 2025 |
Notification | CLICK HERE |
Apply online for Other Apprentice | CLICK HERE |
Apply Online for ITI Trade | CLICK HERE |