DRDO Recruitment 2025 | విశాఖ డీఆర్డీవో లో ఉద్యోగాలు | Walk in Interview ద్వారా భర్తీ

DRDO Recruitment 2025 విశాఖపట్నం డీఆర్డీవోలో నోటిఫికేషన్ విడుదలైంది. నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబ్(NSTL)లో ఖాళీగా ఉన్న 7 జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేేస్తారు. రెండేళ్ల కాలపరిమితితో ఈ కాంట్రాక్ట్ ఉంటుంది. ఈ పోస్టులను కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి. అభ్యర్థులు ఈ తేదీల్లో Walk in Interviewలకు హాజరుకావాల్సి ఉంటుంది.

DRDO Junior Research Fellowship Recruitment 2025

పోస్టుల వివరాలు :

మొత్తం పోస్టులు : 07

మెకానికల్ ఇంజనీరింగ్ – 02
ఎలక్ట్రానిక్స్ – 02
నావల్ ఆర్కిటెక్చర్ – 01
ఎరోస్పేస్, సీఎఫ్డీ – 01
కంప్యూటర్ సైన్స్ – 01

విద్యార్హతలు:

Junior Research Fellowship ఉద్యోగాలకు అప్లయ్ చేేసే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. నెట్ లేదా గేట్ ఎగ్జామ్ క్లియర్ చేసి ఉండాలి.

Age Limit :

DRDO Junior Research Fellowship పోస్టుల వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థుల వయస్సు 28 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది.

ఇంటర్వ్యూకు ఎలా వెళ్లాలి:
DRDO Junior Research Fellowship ఉద్యోగాల ఇంటర్వ్యూకు వెళ్లే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ లో ఉన్న వివరాలను పూరించి సంబంధిత పత్రాలతో ఇంటర్వ్యూకు వెళ్లాలి.

ఇంటర్వ్యూకు ఏ పత్రాలు తీసుకెళ్లాలి:

-విద్యార్హతల మార్కు లిస్టు
-బర్త్ సర్టిఫికెట్ లేదా పదో తరగతి సర్టిఫికెట్
-నెట్/ గేట్ స్కోర్ కార్డ్స్
-క్యాస్ట్ సర్టిఫికెట్
-ఆధార్ కార్డు
-2 పాస్ సైజ్ ఫొటోలు
-ప్రభుత్త రంగ సంస్థలు, అటానమస్ బాడీల్లో పనిచేసినట్లయితే నో అబ్జెక్షన్ లెటర్.
-ఒరిజనల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకెళ్లాలి.

ఇంటర్వ్యూ తేదీలు :

ఫిబ్రవరి 19 : నావల్ ఆర్కిటెక్చర్స్, ఏరో స్పేస్, కంప్యూటర్ సైన్స్ పోస్టుల వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 20 : మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ ఉంటుంది.

ఇంటర్వ్యూ లొకేషన్ :

నావల్ సైన్స్ & టెక్నాలజికల్ లాబొరేటరీ, విజ్ఞాన్ నగర్, ఎన్ఏడీ జంక్షన్, విశాఖపట్నం

Notification & Application : CLICK HERE

Official Website : CLICK HERE

Leave a Comment