HAL Recruitment 2025: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆపరేటర్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 98 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐటీఐ మరియు డిప్లొమా చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేేేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 18వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆగ్నేయాసియాలో ఒక ప్రముఖ ఏరోనాటికల్ కంపెనీ. ఇది ఎయిర్ క్రాఫ్ట్ హెలికాప్టర్లు, ఏరో ఇంజిన్లు, ఉపకరణాలు, ఏవియానిక్స్ మరియు సిస్టమ్స్ రూపకల్పన, ఉత్పత్తి, మరమ్మత్తు, ఓవర్ హాల్ మరియు అప్ గ్రేడ్ చేయడం చేస్తుంంది. ఏరోనాటిక్స్ సంస్థలో ఉద్యోగం చేయాలనుకున్న అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం.
HAL Recruitment 2025 Job Details :
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన మహారత్న సంస్థ అయిన హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ కింద టెక్నీషియన్ మరియు ఆపరేటర్ ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 98 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
డిప్లొమా టెక్నీషియన్(మెకానికల్) | 20 |
డిప్లొమా టెక్నీషియన్ (ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / ఇన్ స్ట్రుమెంటేషన్) | 26 |
ఆపరేటర్ (ఫిట్టర్) | 34 |
ఆపరేటర్ (ఎలక్ట్రీషియన్) | 14 |
ఆపరేటర్ (మిషనిస్ట్) | 03 |
ఆపరేటర్ (షీట్ మెటల్ వర్కర్) | 01 |
HAL Recruitment 2025 Education Qualification :
హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి విడుదలైన ఆపరేటర్ మరియు టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిప్లొమా మరియు ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
పోస్టులు | అర్హతలు |
టెక్నీషియన్ | సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత |
ఆపరేటర్ | సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో NAC / NCTCT సర్టిఫికెట్ ఉండాలి. |
HAL Recruitment 2025 Age Limit :
టెక్నీషియన్ మరియు ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేేసకునే అభ్యర్థులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
Application Fee :
HAL Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అన్ని కేటగిరిల అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
Selection Process :
HAL Recruitment 2025 టెక్నీషియన్ మరియు ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు రాత పరీక్ష బెంగళూరులో నిర్వహిస్తారు. రాత పరీక్షలో 160 ప్రశ్నలు అడుగుతారు. 2.30 గంటల సమయం ఇస్తారు.
జనరల్ అవేర్నెస్ | 20 ప్రశ్నలు |
ఇంగ్లీష్ మరియు రీజనింగ్ | 40 ప్రశ్నలు |
సంబంధిత సబ్జెక్ట్ | 100 ప్రశ్నలు |
Salary :
HAL Recruitment 2025 టెక్నీషియన్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.23,000/- బేసిక్ పే చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు కలుపుకుని నెలకు రూ.47,868/- జీతం ఉంటుంది. ఆపరేటర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.22,000/- బేసిక్ పే ఇస్తారు. ఇతర అలవెన్సులు కలుపుకుని రూ.45,852/- జీతం చెల్లిస్తారు.
పోస్టు పేరు | జీతం |
డిప్లొమా టెక్నీషియన్ | రూ.47,868/- |
ఆపరేటర్ | రూ.45,852/- |
How to Apply HAL Recruitment 2025 :
హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో డిప్లొమా టెక్నీషియన్ మరియు ఆపరేటర్ ఉద్యోగాలకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లయ్ లింక్ కింద ఇవ్వబడింది. లింక్ క్లిక్ చేసి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం | 04 – 04 – 2025 |
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ | 18 – 04 – 2025 |
Notification | CLICK HERE |
Apply Online | CLICK HERE |