Handloom Development Commissioner Group C Jobs 2025 : హ్యాండ్లమ్స్ డెవలప్మెంట్ కమిషనర్ కార్యాలయం నుంచి వివిధ రకాల గ్రూప్ సి ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూనియర్ వివర్, జూనిరయ్ ప్రింటర్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్, కార్ డ్రైవర్ మరియు ఇతర ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ నుంచి 45 రోజుల లోపు దరఖాస్తులను సమర్పించాలి. ఇతర వివరాల కోసం పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Handloom Development Commissioner Group C Jobs 2025
Vacancy Details :
హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ కమిషనర్ కార్యాలయం నుంచి గ్రూప్ సి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో వివిధ రకాల పోస్టులు ఉన్నాయి. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీలు |
జూనియర్ వీవర్ | 03 |
జూనియర్ ప్రింటర్ | 01 |
జూనియర్ అసిస్టెంట్(వీవింగ్) | 01 |
జూనియర్ అసిస్టెంట్ (ప్రాసెసింగ్) | 01 |
అటెండెంట్(నేత) | 02 |
అటెండెంట్(ప్రాసెసింగ్) | 01 |
స్టాఫ్ కార్ డ్రైవర్ | 03 |
Education Qualification :
Handloom Development Commissioner Group C Jobs 2025 గ్రూప్ సి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి లేదా డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. కార్ డ్రైవర్ పోస్టుకు 10వ తరగతితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
Age Limit :
Handloom Development Commissioner Group C Jobs 2025 గ్రూప్ సి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
Application Fee:
Handloom Development Commissioner Group C Jobs 2025 గ్రూప్ సి పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అన్ని కేటగిరీల అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అందరు కూడా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
Selection Process:
Handloom Development Commissioner Group C Jobs 2025 గ్రూప్ సి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఒక వేళ దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉంటే ముందే నిర్ణయించిన ప్రమాణాల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత రాత పరీక్ష మరియు ప్రాక్టికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
Salary :
Handloom Development Commissioner Group C Jobs 2025 గ్రూప్ సి పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,000/- వరకు జీతం ఉండవచ్చు. వివిధ రకాల ఉద్యోగాల పే స్కేల్స్ కింద ఇవ్వబడ్డాయి.
పోస్టు పేరు | జీతం |
జూనియర్ వీవర్ | రూ.29,200 – రూ.92,300/- |
జూనియర్ ప్రింటర్ | రూ.25,500 – రూ.81,100/- |
జూనియర్ అసిస్టెంట్(వీవింగ్) | రూ.19,900 – రూ.63,200/- |
జూనియర్ అసిస్టెంట్ (ప్రాసెసింగ్) | రూ.19,900 – రూ.63,200/- |
అటెండెంట్(నేత) | రూ.18,000 – రూ.66,900/- |
అటెండెంట్(ప్రాసెసింగ్) | రూ.18,000 – రూ.66,900/- |
స్టాఫ్ కార్ డ్రైవర్ | రూ.19,900 – రూ.63,200/- |
How to Apply :
Handloom Development Commissioner Group C Jobs 2025 గ్రూప్ సి పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ లో వివరాలను నింపి, అవసరమైన పత్రాలను జత చేయాలి. అప్లికేషన్ ని స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కింది చిరునామాకు పంపాలి.
Address : Director (West Zone), Weavers Service Centre, 15-A, Mama Parmanand Marg, Mumbai-400004.
Important Dates :
Advertisement Publication | 23 – 03 – 2025 |
Last date for Application | 07 – 5 – 2025 |
Notification & Application | CLICK HERE |