How to become a forest beat officer? Full Information & Details 2025

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎలా అవ్వాలి?

మనలో చాలా మందికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) ఎలా అవ్వాలో తెలియక వారి గోల్స్ ని రీచ్ అవ్వలేకపోతున్నారు. అందుకే ఇక్కడ మనం జాబ్ కి కావాల్సిన అర్హతలు, వయస్సు, హైట్, ఏగ్జామ్ ఎలా ఉంటుంది.. సెలెక్షన్ ఎలా ఉంటుంది.. అనే వాటి గురించి తెలుసుకుందాం..  ముందుగా ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ డ్యూటీ విషయానికి వస్తే.. అడవిలో అగ్నిప్రమాదాలు జరగకుండా చూడటం, స్మగ్లింగ్ జరగకుండా చూడటం, విలువైన చెట్లను దొంగల నుంచి రక్షించడం, వన్య ప్రాణులను కాాపాడటం, అడవుల విస్తీర్ణం కోసం చర్యలు తీసుకోవడం, ఇంకా ఏమైన అవాంఛిత సంఘటనలు జరిగితే వెంటనే వారి పై అధికారులకు తెలియజేసి తగిన చర్యలు తీసుకోవడం వంటి డ్యూటీలు అయితే వీరికి ఉంటాయి. 

ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ లో అయితే ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణలో అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ ఉద్యోగాలకు భారతీయ పౌరులైన స్త్రీ, పురుషులు ఇద్దరు ఎలిజిబుల్ అవుతారు. ఈ జాబ్ కి ఇంటర్ అర్హత ఉంటుంది. ఈ ఉద్యోగానికి 18 నుంచి 31 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. ఇక రిజర్వేషన్లను బట్టి వయస్సు సడలింపు ఉంటుంది. 

ఈ ఉద్యోగాల ఫిజికల్ రిక్వైర్మెంట్ విషయానికి వస్తే..

పురుషులు 163 సెంమీ. ఎత్తు ఉండాలి. చెస్ట్ 79 సెంమీ.. శ్వాస తీసుకుంటే 84 సెంమీ. ఉండాలి. మహిళలు 150 సెంమీ. ఎత్తు ఉండాలి. పురుషులు మినిమిమ్ 48 కేజీల బరువు ఉండాలి. అయితే స్త్రీలు మినిమిమ్ 40 కేజీల బరువు ఉండాలి. ఇంత కంటే తక్కువగా ఉండే ప్రాబ్లమ్ వస్తుంది. అయితే ఎస్టీ అభ్యర్థులకు ఎత్తులో 5 సెంమీ రిలాక్సేషన్ ఉంటుంది. 

Selection Process:

ఆంధ్ర మరియు తెలంగాణ జాబ్ సెలక్షన్ ప్రాసెస్ వేర్వేరుగా ఉంటుంది. ఏపీలో అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ, ఫిజికల్ మెసెర్మెంట్ టెస్ట్, వాకింగ్, మెడికల్ టెస్ట్, చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అదే తెలంగాణ వారికి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉండదు. డైరెక్ట్ గా మెయిన్స్ ఎగ్జామ్, ప్రిలిమినరీ ఎగ్జామ్, వాకింగ్, మెడికల్ టెస్ట్, చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే.. వీరికి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే 150 మార్కులకు ఉంటుంది. ఇందులో 150 ప్రశ్నల ఉంటాయి. సమయం 150 నిమిషాలు ఇస్తారు. ఈ ఎగ్జామ్ లో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ నుంచి పశ్నలు వస్తాయి. ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అయితే మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. 250 మార్కులకు పరీక్ష ఉంటుంది. సమయం 230 నిమిషాలు ఇస్తారు. ఇందులో పేపర్ -1 లో 50 మార్కులకు ఎస్సే రాయాల్సి ఉంటుంది. 

ఇక తెలంగాణ విషయానికి వస్తే కేవలం ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఈ ఎగ్జామ్ 200 మార్కులకు నిర్వహిస్తారు. సమయం 180 నిమిషాలు ఇస్తారు. ఈ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది. 

Walking test:

ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వారికి వాకింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ వాకింగ్ టెస్ట్ లో పురుషులకు 25 కి.మీ., మహిళలకు అయితే 16 కి.మీ. నిర్వహిస్తారు. సమయం నాలుగు గంటలు ఉంటుంది. వాకింగ్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వారికి ఫిజికల్ మెజెర్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.


Leave a Comment