How to get army job || How to prepare for army rally & medical 2025

ఆర్మీ ఉద్యోగం అనేది కొంత మందికి ప్యాషన్.. ఈ ఉద్యోగం సాధించడం కోసం ఎంతో ప్రీపేర్ అవుతుంటారు. అసలు ఆర్మీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ర్యాలీలో ఎలా గెటిన్ అవ్వాలి? ర్యాలీ అయిపోయిన తర్వాత మెడికల్ ఏం చూస్తారు? అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఆర్మీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

ఆర్మీ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేందుకు ఫిజికల్ గా ఫిట్ నెస్ చాలా ముఖ్యం.. డైలీ వర్కవుట్ చేయడం చాలా అవసరం.. ఎందుకంటే నోటిఫికేషన్ పడ్డాకే మనం వర్కవుట్ స్టార్ చేస్తామంటే అది కుదరదు.. ఎందుకంటే ఆర్మీకి ఫిట్ నెస్ అనేది చాలా ముఖ్యం.. అంతే కాదు నోటిఫికేషన్ అయిపోయిన కూడా ప్రతి రోజూ వర్కవుట్ చేస్తుండాలి. లేకపోతే ఫిజికల్ ఫిట్ నెస్ అనేది తగ్గిపోతుంది. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల మెంటల్ గానూ, ఫిజికల్ గానూ ఫిట్ గా ఉంటారు. ఫిట్ గా ఉంటే ఎప్పుడు నోటిఫికేషన్ పడినా రెడీగా ఉండొచ్చు.

రన్నింగ్ ఎలా చేయాలి?

ముఖ్యంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక ప్రణాళిక ప్రకారం ప్రాక్టీస్ చేయాలి. ఆర్మీ ఉద్యోగాల కోసం 1.6 కి.మీ రన్నింగ్ ఉంటుంది. మీరు 1.6 కి.మీ. కాకుండా 2.4 కి.మీ ని ప్రతిరోజూ 7-8 నిమిషాల్లో ప్రాక్టీస్ చేస్తే.. ఈవెంట్స్ సమయంలో 1.6 కి.మీ ఈజీగా అధికమించవచ్చు. ఈవెంట్స్ సమయంలో ఫాస్ట్ గా పరిగెత్త కుండా ఒక నిర్ణీత వేగంతో మొదలుపెట్టి వేగాన్ని పంచుకుంటూపోవాలి. 1.6 కి.మీ అయిపోయిన తర్వాత లాంగ్ జంప్, బ్యాలెన్సింగ్, పులప్స్ ఉంటాయి. ఆ తర్వాత మెడికల్ ఉంటుంది.

మెడికల్ టెస్ట్ లో ఏం చేస్తారు?

ఈవెంట్స్ అన్ని అయిపోయాక మెడికల్ టెస్ట్ ఉంటుంది. అయితే మెడికల్ టెస్ట్ లో ఏముంటది.. అన్న భయం అందరిలో ఉంటుంది. ఈ భయంతో మెడికల్ టెస్ట కి వెళ్లినప్పుడు చేేతులు, కాళ్లు వణుతాయి. ఆ భయంతో అన్ ఫిట్ అవుతారు. కాబట్టి మెడికల్ టెస్ట్ లో భయపడకూడదు. మెడికల్ లో మెయిన్ గా కళ్లు చెక్ చేస్తారు.

ఆ తర్వాత కలర్ బ్లెయిన్డ్ టెస్ట్ ఉంటుంది. ఇదే చాలా మెయిన్ టెస్ట్. తర్వాత చెవులు, ముక్కు, పళ్లు చెక్ చేస్తారు. ఆ తర్వాత ఛెస్ట్, చేతులు, కాళ్లు చెక్ చేస్తారు. అనంతరం మన ప్రైవేట్ పార్ట్స్ కూడా చెక్ చేస్తారు..పైల్స్ ఉన్నా కూడా మెడికల్ ఫెయిల్ చేస్తారు.

Leave a Comment