సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఇలా చేయండి..
సైబర్ క్రైమ్ అంటే ఒక క్రిమినల్ చర్య. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకొని చోరీలకు పాల్పడటం.. చోరీ అంటే మన బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేయడం. కొత్త పథకాలతో ఆశ చూపి బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ చేయడం, ఫొటోను మార్ఫింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం ఈ సైబర్ క్రైమ్ కిందికే వస్తాయి. సైబర్ క్రైమ్ యొక్క ప్రభావం ముఖ్యంగా ఆర్థికంగానే ఉంటుంది. బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డు లేదా ఇతర చెల్లింపు కార్డు సమాచారాన్ని దొంగలించడం సహా అనేక రకాల కార్యకలాపాలు ఈ సైబర్ క్రైమ్ లో ఉంటాయి.
Prevent Cyber Crimes
సైబర్ క్రైమ్ జరగకుండా ఏం చేయాలి?
సైబర్ క్రైమ్ జరగకుండా ఏం చేయాలి అంటే మొదట ఆ ఫ్రాడ్ జరగకుండా మనం ఆపుకోవాలి. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడినప్పుడు కొంత మంది భయానికి గురై డబ్బులు వేస్తారు. మరి కొంత మంది అత్యాశకు వెళ్లి డబ్బులు పొగోట్టుకుంటారు. కొంత మందికి అయితే తెలియకుండానే బ్యాంక్ కార్డు వివరాలను దొంగలించి డబ్బులు కాజేస్తారు. ఫిషింగ్ లింక్స్, హ్యాకింగ్ వంటి మార్గాల వ్వారా ఈ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడతారు. అలా జరిగినప్పడు ఏం చేయాలి… మొదటగా మీ అకౌంట్ లో డబ్బులు కట్ అవుతున్నప్పుడు వెంటనే మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డును బ్లాక్ చేేసేయాలి. వెంటనే మీ బ్యాంకుకు సమాచారం అందించాలి.
హెల్ప్ లైన్ నెంబర్ కి ఫిర్యాదు :
సైబర్ నేరాలు జరిగినప్పుడు వెంటనే నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేయాలి. 1930 అనేది నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్. ఈ నెంబర్ కి కాల్ చేసి ఆన్ లైన్ మోసానికి సంబంధించిన ఫిర్యాదు నమోదు చేయాలి. అప్పుడు వారు మీ వివరాలు నమోదు చేసుకుంటారు. ఎప్పుడు డబ్బులు కట్ అయ్యాయి..ఏ అకౌంట్ నుంచి కట్ అయ్యాయి అనే వివరాలు అడుగుతారు.
గంటలోపు 1930కి ఫిర్యాదు చేస్తే…
మీపై సైబర్ దాడి జరిగింది అనుకోండి.. వెంటనే మీరు రియలైజ్ అయ్యారు. మీ డబ్బులు కట్ అయిన గంటలోపే 1930 అనే నెంబర్ కి కాల్ చేస్తే.. మీ డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మన డబ్బు ఏ అకౌంట్లకు వెళ్లిందో ఆ అకౌంట్లను ఈ పోర్టల్ ఫ్రీజ్ చేస్తుంది. అప్పుడు ఆ అకౌంట్లలో ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగదు. వెబ్ సైట్ ద్వారా కూడా మీరు ఫిర్యాదు నమోదు చేయవచ్చు.
ఈ పోర్టల్ లో ఒక డ్రాప్ డౌన్ బాక్స్ లో మీరు వివరాలు నమోదు చేయాలి. మీ పేరు, అకౌంట్ నెంబర్, మీరు చేసిన ట్రాన్సాక్షన్ డీటైల్స్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, చిరునామా వంటి వివరాలు పొందుపర్చాలి. నమోదు చేయగానే మీకు ఒక అక్ నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది. కేసు నమోదు అయిన వెంటనే గంట లోపు అయితే మీరు ట్రాన్సాక్షన్ చేసిన అకౌంట్లను ఫ్రీజ్ చేస్తారు. ఆ డబ్బును సైబర్ నేరగాళ్లు ఏం చేయలేరు. మీరు ఆలస్యం చేస్తే.. ఆ డబ్బులు ఏ విదేశాలకు గానీ, మరీ ఎక్కడైన కానీ ట్రాన్ఫర్ అయితే దానిని తీసుకురావడం కష్టం అవుతుంది.
ఒక వేళ మీకు ఆన్ లైన్ లో ఫిర్యాదు చేయడం రాకపోతే వెంటనే మీ సమీపంలోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. పోలీసు స్టేషన్ కి వెళ్లి కేస్ చేేసినప్పుడు మీరు కచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు అయినట్లు
చూసుకోండి.. ఒకవేళ పోలీసులు వారు కేసు నమోదు చేయకపోతే నగర కమిషనర్ కి లేదా జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కి ఫిర్యాదు చేయాలి.
అప్రమత్తంగా ఉండాలి..
ముఖ్యంగా ఈ డబ్బులు అనేవి మన తప్పిదాల వల్లనే ట్రాన్ఫర్ అవుతాయి. సైబర్ నేరగాళ్లు అలా ఉచ్చులో వేస్తారు. అన్ నౌన్ లింక్స్ పై క్లిక్ చేయడం, ఓటీపీలు చెప్పడం, లేదా తెలియని వారికి డబ్బులు వేయడం చేస్తుంటాం.. ఈ విషయాల్లో మనమే చాలా అప్రమత్తంగా ఉండాలి.