IIT Roorkee Recruitment 2025 ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ మరియు ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 55 పోస్టులు ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ, బీఈ, బీటెక్, డిప్లొమా, ప్రోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
IIT Roorkee Recruitment 2025
పోస్టుల వివరాలు :
ఐఐటీ రూర్కీ జూనియర్ ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్ మరియు ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 55 పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య : 55
పోస్టు పేరు | ఖాళీలు |
జూనియర్ ఇంజనీర్ | 02 |
జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ | 04 |
అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ | 01 |
జూనియర్ సూపరింటెండెంట్ | 06 |
జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ | 11 |
జూనియర్ అసిస్టెంట్ | 31 |
అర్హతలు :
IIT Roorkee Recruitment 2025 ఐఐటీ రూర్కీలో ఉద్యోగాలకు పోస్టును బట్టి అర్హతలు వేర్వేరుగా ఉంటాయి. కింద ఇచ్చిన అర్హతలను చూసి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టు పేరు | అర్హతలు |
జూనియర్ ఇంజనీర్ | సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా |
జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ | CSE / EE / ECE / Diploma / MSc / BSc / MCA / BE / B.Tech |
అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ | ఏదైనా డిగ్రీ |
జూనియర్ సూపరింటెండెంట్ | ఏదైనా డిగ్రీ లేదా పీజీ |
జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ | డిప్లొమా |
జూనియర్ అసిస్టెంట్ | ఏదైనా డిగ్రీ |
వయస్సు :
IIT Roorkee Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభర్థులకు 18 నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
IIT Roorkee Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న జనరల్ అభ్యర్థులు రూ.500/-, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
కేటగిరీ | ఫీజు |
జనరల్ | రూ.500/- |
OBC / EWS | రూ.400/- |
SC / ST / PWD / Women | No Fee |
ఎంపిక ప్రక్రియ:
IIT Roorkee Recruitment 2025 ఐఐటీ, రూర్కీలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం :
IIT Roorkee Recruitment 2025 ఐఐటీ, రూర్కీలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
IIT Roorkee Recruitment 2025 ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ లింక్ కింద ఇవ్వబడింది. ఆ లింక్ పై క్లిక్ చేసి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
- ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 07 – 04 – 2025
Notification | CLICK HERE |
Apply Online | CLICK HERE |