Indian Air Force Agniveer Notification 2025 | ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్స్ | ఇంటర్ అర్హతత ఉద్యోగాలు|

IAF Agniveer Vayu Recruitment 2025 :

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. అగ్నిపథ పథకంలో భాగంగా IAF Agniveer Vayu కోసం ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎలా అప్లయ్ చేయాలి, ఈ ర్యాలీ ఎప్పుడు జరుగుతుంది అనే వివరాలను వివరంగా తెలుసుకుందాం..

IAF Agniveer Vayu Recruitment 2025

ముఖ్యమైన తేదీలు:

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీర్ ఉద్యోగాల కోసం 7 జనవరి 2025 నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 27 జనవరి 2025. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి దరఖాస్తులు చేసుకోని వారు త్వరగా దరఖాస్తులు చేసుకోండి.. 22 మార్చి 2025న ఆన్ లైన్ పరీక్ష నిర్వహిస్తారు.

విద్యార్హతలు:

సైన్స్ సబ్జెక్టులు: 10+2 లో గణితం, భౌతికశాస్త్రం మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులలో కనీసం 50 శాతం మార్కులతో పాస్ అయి ఉండాలి. ఇంగ్లీష్ లో 50 శాతం మార్కులు ఉండాలి.

నాన్ సైన్స్ సబ్జెక్టు : ఏదైనా స్ట్రీమ్ లో 10+2 లో 50 శాతం మార్కులతో మరియు ఇంగ్లీష్ లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు గరిష్ట వయస్సు 21 సంవత్సరాలు లోపు ఉండాలి. 27 జూన్, 2004 మరియు 27 డిసెంబర్, 2007 మధ్య జన్మించి ఉండాలి.

వైవాహిసక స్థితి:

పెళ్లి కాని భారతీయ స్త్రీ, పురుషులు మాత్రమే IAF Agniveer ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

అప్లికేషన్ ఫీజు:

IAF Agniveer Vayu Recruitment 2025 కోసం రూ.550 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈ ఫీజును చెల్లించాలి.

How to Apply IAF Agniveer Vayu Recruitment 2025 :

దరఖాస్తులను ఎలా అప్లయ్ చేయాలి:

ముందుగా https://agnipathvayu.cdac.in/AV/ వెబ్ సైట్ ని సందర్శించి దరఖాస్తును పూర్తి చేయాలి. దరఖాస్తు సమయంలో అవసరమైన పత్రాను అప్ లోడ్ చేయాలి. నెబ్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు సమయంలో కావాల్సిన పత్రాలు:

దరఖాస్తు చేసే సమయంలో ఈ పత్రాలు పెట్టుకోవాలి. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, స్కాన్ చేసిన సంతకం, బొటన వేలి ముద్రలు, 10వ తరగతి మరియు 12వ తరగతి సర్టిఫికెట్లు, నోటిఫికేషన్ లో పేర్కొన్న ఏదైనా ఇతర సంబంధిత విద్యా లేదా గుర్తింపు పత్రాలు.

దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ : 27 జనవరి, 2025

1 thought on “Indian Air Force Agniveer Notification 2025 | ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్స్ | ఇంటర్ అర్హతత ఉద్యోగాలు|”

Leave a Comment